Alibaba: చైనాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ చాలా పెద్దది. జాక్ మా సృష్టించిన ఈ వ్యాపార సామ్రాజ్యం విలువ దాదాపు 220 బిలియన్ డాలర్లు. చైనా ప్రభుత్వంపై కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ సంస్థకు చెడ్డ కాలం మెుదలైంది. కంపెనీకి సంబంధించిన యాంట్ కార్పొరేషన్ ఐపీవోను సైతం అర్థాంతరంగా నిలిచిపోయింది. అలా జాక్ మా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ప్రపంచ మార్కెట్లలో అలీబాబాకు చెందిన ఈ కామర్స్ సంస్థ ఇతిపెద్ద మార్కెట్ కలిగి ఉంది. దీనికి 200 దేశాల నుంచి కోటి మంది యాక్టివ్ కస్టమర్లు కూడా ఉన్నారు. అలీబాబా మెుత్తం వ్యాపారాల్లో ఈ రంగం విలువ దాదాపు 102 బిలియన్ డాలర్లుగా ఉంది. మార్చి 31, 2022తో ముగిసిన సంవత్సరంలో Alibaba.com ద్వారా 190కి పైగా దేశాల నుంచి 4 కోట్లకు పైగా కొనుగోలుదారులు వ్యాపార అవకాశాలను లేదా లావాదేవీలను పూర్తి చేశారని కంపెనీ తెలిపింది.

ఇదే క్రమంలో కంపెనీ కామర్స్, క్లౌడ్, కైనియావో లాజిస్టిక్స్, కన్జూమర్ సర్వీసెస్, డిజిటల్ మీడియా, ఇన్నోవేషన్ వంటి రంగాల్లో వ్యాపారాలను కలిగి ఉంది. అయితే ఇప్పటి వరకు ఇవన్నీ ఒకటే గొడుగు కింద కలిసి ఉన్నాయి. ఈ క్రమంలో అలీబాబా సంస్థ తన మెుత్తం వ్యాపారాలను 6 విభాగాలుగా విభజించి ముక్కలుగా చేయాలని నిర్ణయించింది. వీటిని విడి ఎంటిటీలుగా మార్చటం ద్వారా వ్యాల్యూ అన్ లాకింగ్ జరుగుతుందని కంపెనీ భావిస్తోంది.
చైనా ఆన్‌లైన్ కామర్స్ లీడర్ మంగళవారం తన 220 బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఆరు యూనిట్లుగా విభజించే ప్రణాళికలను ప్రకటించి మార్కెట‌్లను ఆశ్చర్యపరిచింది. కొత్తగా ఎర్పడనున్న కంపెనీలు ఐపీవోలుగా మార్కెట్లోకి వచ్చి తమ అవసరాలకు నిధులను సమీకరించుకోనున్నాయని గ్రూప్ వెల్లడించింది. ఈ ప్రకటనతో ఇన్వెస్టర్లు సంతోషంలో ఉన్నారు. దీంతో అలీబాబా షేర్లు హాంగ్ కాంగ్ లో ఏకంగా 16 శాతానికి పైగా పెరిగాయి. ఈ నిర్ణయంతో కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు 30 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. వ్యాపార మార్గాలను, నిర్ణయ అధికారాలను వికేంద్రీకరించటం ద్వారా చైనా ప్రభుత్వ అణచివేత నుంచి కంపెనీకి ఊరట లభించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications