Mega Bonus: మనకు తెలిసినంత వరకు బోనస్ అంటే కంపెనీలు వేలల్లోనో లేక వందల్లోనో చెల్లిస్తుంటాయి. కానీ ఒక కంపెనీ మాత్రం తన ఉద్యోగులకు కట్టలు కట్టలు డబ్బును బోనస్ గా అందించింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా ఫ్లాట్ ఫారంలలో సంచలనంగా మారాయి.

కట్టలు కట్టలుగా..
చైనాలోని ఒక కంపెనీ పెద్ద పార్టీని నిర్వహించింది. అందులో కట్టలు కట్టలుగా డబ్బును స్టేజిపై పేర్చింది. రెండు మీటర్ల ఎత్తున డబ్బు కట్టలను పేర్చింది. కంపెనీ తన కంపెనీలోని టాప్ పెర్ఫార్మర్‌లకు మిలియన్ల యువాన్‌లను అందజేసింది. ఇందులో ఉద్యోగులు తమ బోనస్ మెుత్తాన్ని కట్టలు కట్టలుగా తీసుకెళ్లటం చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కంపెనీ వివరాలు..
సెంట్రల్ చైనాలో ఉన్న క్రేన్స్ తయారీ సంస్థ హెనాన్ మైన్ ఉద్యోగులకు ఊహించని బోనస్ అందించింది. కంపెనీ 2022లో మంచి లాభాలను ఆర్జించింది. మందగమనంలోనూ కంపెనీ పనితీరు మెరుగ్గా ఉండటంతో.. 40 మంది సేల్స్ మేనేజర్లకు మెుత్తం 60 మిలియన్ యువాన్లను బోనస్ గా అందించింది.

డబ్బుల పోటీ..
కంపెనీ ఉద్యోగులు నగదు లెక్కింపు పోటీలో కూడా పాల్గొన్నారు. కౌంట్ డౌన్ స్టార్ట్ కాగానే లెక్కించటం మెుదలు పెట్టారు. వారు లెక్కించగలిగేంత ఎక్కువ 100 యువాన్ నోట్లను గెలుచుకున్నారు. క్రేన్ తయారీలో హెనాన్ మైన్ కంపెనీ ప్రముఖ ఆటగాడిగా ఉంది. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా మెత్తం 380 కార్యాలయాల్లో 2,700 మంది సిబ్బందిని కలిగి ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా..
కంపెనీ తన ఉత్పత్తులను ఆస్ట్రేలియా, వియత్నాం, థాయ్‌లాండ్, యునైటెడ్ స్టేట్స్, ఇండియా, పాకిస్తాన్, ఈజిప్ట్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, మలేషియా, సింగపూర్, మాల్టా, తుర్క్‌మెనిస్తాన్, సౌదీ అరేబియా, పెరూ, ఇథియోపియాలో విక్రయిస్తోంది. కంపెనీ ఏటా 2.3 బిలియన్ల వరకు విక్రయాలను నమోదు చేస్తోంది.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications