సాధారణంగా ఏ కంపెనీ అయినా ఏడాది చివరలో చిన్నపాటి గిఫ్టులు లేదా నెల జీతం బోనస్ (Salary bonus) గా ఇస్తుంది. కానీ, చైనాలోని ఒక కంపెనీ బాస్ మాత్రం అందరికీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. తన కంపెనీకి వచ్చిన లాభాల్లో ఏకంగా 70 శాతాన్ని ఉద్యోగులకే బోనస్ గా ఇచ్చేసి, సోషల్ మీడియాలో 'రియల్ గాడ్ ఆఫ్ వెల్త్' (నిజమైన కుబేరుడు) అని పిలిపించుకుంటున్నాడు. ఆ దేశంలోని హెనాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఎంత లెక్కిస్తే అంత మీదే!
హెనాన్ క్వాంగ్‌షాన్ క్రేన్ కంపెనీ (Henan Kuangshan Crane Co., Ltd.) ఇటీవల తన వార్షిక వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ ఈవెంట్ లో సుమారు 7,000 మంది ఉద్యోగులకు 800 భోజన టేబుళ్లను ఏర్పాటు చేశారు. వేదికపై ఏకంగా 180 మిలియన్ యువాన్ల (సుమారు రూ. 210 కోట్లు) నగదును కుప్పలుగా పోశారు. ఉద్యోగులను స్టేజీ మీదకు పిలిచి, ఒక నిర్దేశిత సమయంలో వారు ఎన్ని నోట్ల కట్టలను లెక్కపెట్టగలిగితే.. అంత సొమ్మును వారు ఇంటికి తీసుకెళ్లవచ్చని బాస్ ప్రకటించడంతో అక్కడ సందడి నెలకొంది.
బంగారం వద్దు.. నగదు మాత్రమే!
కంపెనీ బాస్ కుయ్ పీజున్ (Cui Peijun) తన ఉదారతను చాటుకుంటూ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌పై సరదాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఎందుకు మనం వాషింగ్ మెషీన్లు ఇస్తున్నాం? బంగారం ధరలు పెరిగాయని అనుకుంటున్నారా? గతంలో మనం ఉంగరాలు, నెక్లెస్‌లు ఇచ్చాం. ఇప్పుడు అవన్నీ ఆపేసి, ప్రతి ఒక్కరికీ అదనంగా మరో 20,000 యువాన్లు (రూ. 2.3 లక్షలు) నగదు ఇవ్వండి" అని స్టేజీ మీద నుంచే ఆదేశించారు. 2025లో కంపెనీకి వచ్చిన 270 మిలియన్ యువాన్ల లాభంలో సుమారు 180 మిలియన్ యువాన్లను ఉద్యోగులకే పంచేయడం విశేషం.
ఎందుకీ ఉదారత?
సోషల్ మీడియాలో ఈ బాస్‌కు 'డబ్బులు పంచే బాస్' అని పేరు వచ్చింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. "నాకు డబ్బులు పంచడం ఇష్టమని కాదు. కానీ, నేటి యువత కార్ లోన్లు, హోమ్ లోన్ల భారంతో సతమతమవుతున్నారు. మా వంతుగా వారికి ఇచ్చే ఈ చిన్న సాయం వారి జీవితాల్లోని కష్టాలను తగ్గిస్తుందని నా నమ్మకం" అని చెప్పుకొచ్చారు. గతంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా 2,000 మంది మహిళా ఉద్యోగులకు భారీగా బోనస్ లు ఇచ్చి ఆయన వార్తల్లో నిలిచారు.
నెటిజన్ల రియాక్షన్
ఈ వార్త చూసిన చైనా నెటిజన్లు అసూయతో పాటు ప్రశంసలు కురిపిస్తున్నారు. "ప్రతి కంపెనీలో ఇలాంటి బాస్ ఉంటే.. ఉద్యోగులు ఇంకా కష్టపడి పనిచేస్తారు" అని ఒకరు కామెంట్ చేయగా "ఈయన నిజమైన మనిషి రూపంలో ఉన్న దేవుడు" అని మరొకరు కొనియాడారు. కేవలం అడ్వర్టైజ్మెంట్లకు కోట్లు ఖర్చు చేసే బదులు, ఇలా ఉద్యోగులను ఆదుకోవడం వల్ల కంపెనీ బ్రాండ్ వాల్యూ విపరీతంగా పెరిగిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఒక బాస్ తన ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటే కంపెనీ ఎంత వేగంగా ఎదుగుతుందో చెప్పడానికి ఈ చైనా కంపెనీ ఒక అద్భుతమైన ఉదాహరణ. 2002లో చిన్నగా మొదలై, నేడు 130 దేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి ఈ సంస్థ ఎదిగింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!



Click it and Unblock the Notifications