పసిడి ప్రియుల కొంపలు ముంచబోతున్న చైనా.. బంగారం ధరలు పెంచేందుకు బిగ్ స్కెచ్..

ప్రపంచంలోనే ప్రతి రంగంలోనూ అమెరికాకు బలమైన పోటీదారుగా నిలవాలని భావిస్తున్న చైనా.. ఇప్పుడు తన బంగారు నిల్వలను భారీగా పెంచుకోవడంలోనూ అదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అమెరికన్ డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా చైనా సెంట్రల్ బ్యాంక్.. గత కొంతకాలంగా అత్యంత నిశ్శబ్దంగా.. ధరలు తగ్గినప్పుడల్లా పెద్ద ఎత్తున బంగారాన్ని పోగుచేస్తోంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో తాను కొనుగోలు చేస్తున్న అసలు బంగారం పరిమాణాన్ని చైనా పూర్తిస్థాయిలో బయటకు వెల్లడించడం లేదని.. తక్కువగా చూపించి రహస్యంగా నిల్వలను పెంచుకుంటోందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక ప్రకారం.. చైనా మే నెలలో లండన్ ఓటీసీ (OTC) మార్కెట్ ద్వారా ఏకంగా 48 టన్నులకు పైగా బంగారాన్ని కొనుగోలు చేసింది. గత ఒక సంవత్సరంలో ఒకే నెలలో చైనా జరిపిన అతిపెద్ద కొనుగోలు ఇదే కావడం గమనార్హం. అయితే చైనా సెంట్రల్ బ్యాంక్ మే నెలలో కేవలం 10 టన్నులు మాత్రమే కొనుగోలు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. అంటే వాస్తవ కొనుగోళ్లు అధికారిక గణాంకాల కంటే దాదాపు 4.8 రెట్లు ఎక్కువ.

China Gold Reserves China Gold Buying Gold Prices Gold Market Central Bank Gold Bullion Market Gold Price Today Gold Reserve Precious Metals Business News Gold News China Gold Reserves

ఇక జూన్ నెలలో 15 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు డ్రాగన్ కంట్రీ ప్రకటించింది, ఇది గత 2.5 సంవత్సరాలలో దాని అతిపెద్ద నెలవారీ కొనుగోలుగా నిలిచింది. వరుసగా 20వ నెల కూడా చైనా తన వద్ద ఉన్న Gold నిల్వలను పెంచుకుంటూ వచ్చింది. ఈ ఏడాది ఇప్పటివరకు అధికారికంగా 40 టన్నుల కొనుగోలును ప్రకటించినప్పటికీ.. నిపుణుల అంచనాల ప్రకారం చైనా వాస్తవానికి సుమారు 80 టన్నులకు పైగా Gold సేకరించింది.

Also Read

చైనా తన బంగారు నిల్వలను కనీసం 5,000 టన్నులకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. ప్రస్తుతం అత్యధిక పసిడి నిల్వలు ఉన్న అమెరికా సరసన చేరడానికి చైనాకు ఇంకా చాలా సమయం పడుతుంది. ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికా వద్ద ఏకంగా 8,133.5 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. ఈ విషయంలో ఏ ఇతర దేశం కూడా అమెరికాకు దరిదాపుల్లో కూడా లేదు. ప్రపంచ దేశాల బంగారు నిల్వల జాబితాను పరిశీలిస్తే..

1. అమెరికా: 8,133.5 టన్నులు
2. జర్మనీ: 3,350.3 టన్నులు
3. ఇటలీ: 2,451.8 టన్నులు
4. ఫ్రాన్స్: 2,437 టన్నులు
5. రష్యా: 2,330 టన్నులు

ప్రస్తుతం చైనా 2,313 టన్నుల అధికారిక నిల్వలతో ప్రపంచంలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. చైనా తదుపరి స్థానాల్లో స్విట్జర్లాండ్ (1,040 టన్నులు), భారతదేశం (881 టన్నులు), జపాన్ (846 టన్నులు), నెదర్లాండ్స్ (612 టన్నులు) నిలిచాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, డాలర్ డిమాండ్‌లో మార్పుల నేపథ్యంలో చైనా ఆడుతున్న ఈ గోల్డ్ గేమ్‌ రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+