Jack Ma: చైనా ప్రభుత్వం జోలికి వెళ్లినా, దానిపై దిక్కార స్వరం వినిపించినా పరిస్థితులు ఎలా ఉంటాయో అనే దానికి జాక్ మా జీవితం పెద్ద ఉదాహరణ. ఇలా చరిత్రలో కనుమరుగైనా చైనీయులు ఎందరో. చైనా బ్యాంకింగ్ వ్యవస్థపై ఒక సమావేశంలో జాక్ మా చేసిన కామెంట్స్ ఆయనను అజ్ఞాతంలోకి వెళ్లేలా చేశాయి. ఒకానొక సమయంలో అతడు మరణించాడనే పుకార్లు కూడా వచ్చాయి. అయితే.. కమ్యూనిస్ట్ చైనా ప్రభుత్వంతో పోరాడలేక అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా సంచలన నిర్ణయం తీసుకున్నారు.

బిలియనీర్ అతిపెద్ద నిర్ణయం..
చైనా బిలియనీర్ జాక్ మా ఒక సంవత్సరం పాటు ప్రభుత్వ ఒత్తిడి తర్వాత యాంట్ గ్రూప్ యాజమాన్యాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తన నివేదికలో వెల్లడించింది. అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్‌ను జాక్ మా స్థాపించారు. ఈ కంపెనీకి ఒక బిలియన్ వినియోగదారులతో అలీబాబా చెల్లింపుల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. అలాగే మైక్రోలెండింగ్ వ్యాపారం కూడా ఉంది.

యాంట్ గ్రూప్ వ్యవహారం..
ప్రస్తుతం జాక్ మా యాంట్ గ్రూప్‌లో ఎగ్జిక్యూటివ్ పాత్రను కలిగి లేరు. కేవలం ఆలీబాబా సంస్థతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని టెక్ క్రంచ్ తన వార్తా కథనంలో వెల్లడించింది. యాంట్ గ్రూప్ షేర్లలో 50 శాతానికి పైగా నియంత్రణను హాంగ్‌జౌ యున్‌బో ఇన్వెస్ట్‌మెంట్ కన్సల్టెన్సీ కలిగి ఉంది. ఈ కన్సల్టెన్సీలో 57 ఏళ్ల జాక్ మా కు మూడో వంతు వాటా ఉంది.

యాంట్ ఐపీవోకు బ్రేకులు..
యాంట్ గ్రూప్ 2020లో 300 బిలియన్ డాలర్ల విలువైన అతి పెద్ద ఐపీవో కోసం సర్వం సిద్ధం చేసుకుంది. అయితే ఈ ప్రక్రియను చైనా రెగ్యులేటర్లు చివరి నిమిషంలో నిలిపివేశారు. వారు దానిని ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీగా పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. టెక్ దిగ్గజ వ్యాపార వేగానికి కళ్లెం వేసి సాంప్రదాయ బ్యాంకుల మాదిరిగానే ఆర్థిక నిబంధనల ప్రకారం దానిని బలవంతం చేయడానికి ప్రయత్నించారు.

కంపెనీ నియంత్రణను వదులుకోవాలని..
రెగ్యులేటర్లు నాయకత్వ మార్పును డిమాండ్ చేయనప్పటికీ.. నియంత్రణను వదులుకోవాలనే అతని ఉద్దేశాన్ని తెలుసుకున్నప్పుడు జాక్ మా కు "వారి ఆశీర్వాదం" అందించారు. కంపెనీ ఒకే ఆధిపత్య నాయకుడిపై ఎక్కువగా ఆధారపడటం వల్ల కలిగే వ్యాపార ప్రమాదం గురించి జాక్ మా చాలా కాలంగా ఆందోళన చెందుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఐపీఓ తీసుకొచ్చెందుకు ఇలా..
జాక్ మా 2013లో అలీబాబా CEOగా, 2019లో ఛైర్మన్‌గా వైదొలిగినప్పటి నుంచి కంపెనీలో మార్పులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు తన వాటాను తగ్గించుకుని దానిని ఇతర యజమానులకు నియంత్రణను బదిలీ చేయటం ద్వారా యాంట్ నుంచి వెనక్కి తగ్గుతారు. ఇలా నాయకత్వ మార్పుల వల్ల చైనీస్ మార్కెట్ నిబంధనల ప్రకారం దాని IPOని పునరుద్ధరించడానికి యాంట్ ప్రణాళికలను మరింతగా ఆలస్యం చేస్తుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications