ఏఐ స్టాక్స్: చైనా మార్కెట్లో భారీ పతనం వెనుక షాకింగ్ నిజం!
ఏఐ స్టాక్స్ పడిపోతున్నా, ఈ రంగంలో పోటీ మాత్రం తగ్గడం లేదు. ఏఐ టెక్నాలజీలో అమెరికాకు దీటుగా ఆధిపత్యం చెలాయించేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో, చైనా నుంచి పెద్ద సంఖ్యలో ఓపెన్‌సోర్స్ ఏఐ మోడల్స్ కూడా మార్కెట్లోకి వస్తున్నాయి.
అయితే, అమెరికా విధిస్తున్న చిప్ ఆంక్షలు, చైనా ఏఐ మోడల్స్‌పై కఠిన నిబంధనల కారణంగా చైనా ఏఐ కంపెనీల షేర్లు దారుణంగా పడిపోతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఈ రంగంపై నమ్మకాన్ని కోల్పోతున్నారు.
ఈ ఏడాది జూన్ చివరి నుంచి, చైనాలోని 3 ప్రధాన టెక్నాలజీ కంపెనీల షేర్లతో కూడిన సూచీల మొత్తం మార్కెట్ విలువ 1.7 ట్రిలియన్ డాలర్లు పడిపోయింది. అమెరికా ఏఐ మార్కెట్లో వచ్చిన నష్టానికి ఇది దాదాపు సమానంగా ఉందని భావిస్తున్నారు.
ఉదాహరణకు, 2026 మొదటి 6 నెలల్లో భారీగా పెరిగిన Z.AI, Zhongji Innolight వంటి కంపెనీల షేర్లు కూడా ఇప్పుడు కుప్పకూలి పాతాళానికి పడిపోయాయి.

ఇంకా చెప్పాలంటే, టెక్ షేర్లు ఎక్కువగా ఉండే హాంకాంగ్ హ్యాంగ్ సెంగ్ టెక్ ఇండెక్స్ ప్రస్తుతం 2 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. అదేవిధంగా, కంప్యూటర్ హార్డ్‌వేర్ కంపెనీలు ఎక్కువగా ఉండే ChiNext ఇండెక్స్ ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో గరిష్ట స్థాయికి చేరి, ఇప్పుడు 31 శాతం నష్టపోయింది. చిప్ కంపెనీలు ఎక్కువగా ఉండే Star 50 ఇండెక్స్ కూడా భారీ పతనంలో ఉంది.
ఒకప్పుడు చైనా ఏఐ వృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న డీప్‌సీక్ (DeepSeek), అమెరికా కంపెనీలు వరుసగా అధునాతన మోడల్స్‌ను తీసుకురావడంతో ఇప్పుడు కాస్త వెనుకబడింది.
అమెరికా ఏఐ మోడల్స్ ధర ఎక్కువగా ఉండగా, చైనా కంపెనీలు తమ మోడల్స్‌ను చౌకగా అందిస్తున్నాయి. ఈ కారణంగా, అమెరికా తనకున్న మార్గాలను ఉపయోగించి చైనా ఏఐ వృద్ధిని అడ్డుకుంటోంది.
దీంతో అమెరికా మిత్రదేశాలు, చైనా ఏఐ మోడల్స్‌ను ముప్పుగా భావించే దేశాలు కూడా అడ్డంకులు సృష్టిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చైనాకు, దాని ఏఐ మోడల్స్‌కు ఇలాంటి అడ్డంకులు ఎదురవుతున్నందున, చైనా ఏఐ స్టాక్స్ పతనం కొనసాగుతూనే ఉంది.
ఇదే తరహాలో, చైనాకు చిప్స్, కంప్యూటింగ్ పవర్ సరఫరాను నిలిపివేయడానికి అమెరికా ప్రభుత్వం కఠినమైన విధానాలు, నిబంధనలు, పన్నులను అమలు చేస్తోంది. అమెరికా, తైవాన్, దక్షిణ కొరియా ఏఐ స్టాక్స్ కూడా పడిపోతున్నప్పటికీ, ఇంకా మైనస్‌లోకి అయితే వెళ్లలేదు.


Click it and Unblock the Notifications