బంగారం ఇక దొరకదు.. భారీగా కొని దాచిపెట్టుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణమేమిటంటే..

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య చోటుచేసుకుంటున్న ఆర్థిక అస్థిరతలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు (Central Banks) తమ భద్రతకు బంగారాన్నే ప్రధాన ఆయుధంగా ఎంచుకుంటున్నాయి. విదేశీ మారక నిల్వల్లో (Forex Reserves) అమెరికన్ డాలర్ ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ.. తమ నిల్వలను వైవిధ్యపరచడానికి (Diversification) నిరంతరం బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. వర్ల్డ్ గోల్డ్ కౌన్సిల్ (World Gold Council - WGC) ఇటీవల విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. ఈ ధోరణి ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూడా నిలకడగా కొనసాగింది.

ఆగస్టు నెలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు నికరంగా 39 టన్నుల బంగారాన్ని తమ నిల్వలకు జోడించాయి. దీనితో 2026లో ఇప్పటివరకు కేంద్ర బ్యాంకులు అధికారికంగా నివేదించిన మొత్తం నికర బంగారు కొనుగోళ్లు 170 టన్నులకు చేరుకున్నాయి. అనిశ్చితి సమయంలో బంగారం అత్యంత సురక్షితమైన ఆస్తిగా (Safe Haven Asset) భావించడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

China Central Bank China Gold Buying September Gold Purchases China Gold Reserves Gold Prices Bullion Market Gold Reserves China Gold Holdings Central Bank Gold Buying Global Gold Market Gold Price Outlook Gold Investment China Gold Buying September China Central Bank Gold Reserves China Gold Reserves Gold Price Today China Buys Gold Global Gold Market Bullion Prices Central Bank Gold Buying Gold Price Outlook China Gold Holdings

బంగారం కొనుగోలు విషయంలో అగ్రరాజ్యం చైనా, ఐరోపా దేశమైన పోలాండ్ ముందంజలో ఉన్నాయి. చైనా తన బంగారు నిల్వలను వరుసగా పెంచుకుంటూ పోతోంది. ఆగస్టు నెలలో 20 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా, సెప్టెంబర్‌లో కూడా ఈ కొనుగోళ్లను కొనసాగించి వరుసగా 23వ నెల కూడా బంగారాన్ని సమీకరించింది. సెప్టెంబర్ నాటికి చైనా వద్ద మొత్తం 77.47 మిలియన్ ఫైన్ ట్రాయ్ ఔన్సుల (సుమారు 2,387 టన్నులు) Gold ఉంది. చైనా మొత్తం నిల్వల్లో బంగారం వాటా ప్రస్తుతం 9 శాతంగా ఉంది. 2026లో ఇప్పటివరకు చైనా 80 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసి ప్రపంచంలో రెండవ స్థానంలో నిలిచింది.

Also Read

2026లో బంగారం కొనుగోళ్లలో పోలాండ్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆగస్టులో 8 టన్నులు కొనుగోలు చేసిన పోలాండ్, ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 98 టన్నుల బంగారాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పోలాండ్ వద్ద 648 టన్నుల బంగారం ఉండగా, త్వరలోనే 700 టన్నుల లక్ష్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇక ఉజ్బెకిస్తాన్ ఆగస్టులో 8 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయడంతో, ఈ ఏడాది దాని కొనుగోళ్లు 50 టన్నులకు చేరాయి. ఆ దేశం మొత్తం నిల్వల్లో Gold వాటా ఏకంగా 90% (439 టన్నులు) కావడం విశేషం. అలాగే కజకిస్తాన్ ఆగస్టులో 7 టన్నులు (ఈ ఏడాది మొత్తం 36 టన్నులు) కొనుగోలు చేయగా, దాని నిల్వల్లో బంగారం వాటా 79%కి పెరిగింది.

చెక్ నేషనల్ బ్యాంక్ వరుసగా 42వ నెల కూడా తన కొనుగోళ్లను కొనసాగిస్తూ ఆగస్టులో 2 టన్నులు (ఈ ఏడాది 14 టన్నులు) సేకరించింది. గత మూడు నెలలుగా విక్రయాలు జరిపిన టర్కీ, ఆగస్టులో తిరిగి 3 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. బొలీవియా మరియు ఘానా దేశాలు కూడా తలొక 1 టన్ను చొప్పున కొనుగోలు చేశాయి.

ఇదిలా ఉంటే కొన్ని దేశాలు తమ వ్యూహాత్మక అవసరాల కోసం ఆగస్టులో బంగారాన్ని విక్రయించాయి. రష్యా సెంట్రల్ బ్యాంక్ ఆగస్టులో 6 టన్నుల బంగారాన్ని విక్రయించింది. దీనితో 2026లో రష్యా మొత్తం విక్రయాలు 56 టన్నులకు చేరాయి (ప్రస్తుతం రష్యా వద్ద 2,271 టన్నుల బంగారం ఉంది). అలాగే జోర్డాన్ ఆగస్టులో 3 టన్నుల బంగారాన్ని విక్రయించగా.. ప్రస్తుతం దాని వద్ద 75 టన్నుల బంగారం ఉంది.

ఒకవైపు బంగారం నిల్వలు పెరుగుతుండగా.. మరోవైపు సెప్టెంబర్ నెలలో చైనా విదేశీ మారక (ఫారెక్స్) నిల్వల్లో అనూహ్య క్షీణత నమోదైంది. ఆగస్టు చివరి నాటికి 3.438 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న చైనా విదేశీ మారక నిల్వలు, సెప్టెంబర్ చివరి నాటికి 3.400 ట్రిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇది ఆర్థికవేత్తలు అంచనా వేసిన (3.420 ట్రిలియన్ డాలర్లు) దానికంటే ఎక్కువ క్షీణత. సెప్టెంబర్‌లో అంతర్జాతీయ మార్కెట్లో యుఎస్ డాలర్ ఇండెక్స్ 2.06%

బలపడటం చైనా ఫారెక్స్ నిల్వల విలువ తగ్గడానికి ప్రధాన కారణమైంది. అదే సమయంలో డాలర్‌తో పోలిస్తే చైనీస్ యువాన్ 0.22% స్వల్పంగా బలపడినప్పటికీ, మారకపు రేట్ల మార్పులు, రిజర్వ్ ఆస్తుల విలువ వ్యత్యాసాల వల్ల నిల్వలు తగ్గాయి.

2016 నుండి 2025 వరకు ఉన్న గణాంకాలను పరిశీలిస్తే.. ప్రపంచ ఆర్థిక లేదా భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులే కేంద్ర బ్యాంకుల బంగారు సమీకరణకు ప్రధానమైన శక్తులుగా పనిచేస్తున్నాయి. డాలర్ ఆధిపత్యం నుండి బయటపడేందుకు (De-dollarization), భవిష్యత్ ఆర్థిక సంక్షోభాల నుండి రక్షణ పొందేందుకు చైనా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు బంగారం వైపే మొగ్గు చూపుతున్నాయని ఈ ధోరణి స్పష్టం చేస్తోంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+