ప్రతిఒక్క తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు బాగుండాలని సేవింగ్స్ ప్లాన్స్ లేదా ఫ్యూచర్ ప్లాన్స్ చేస్తుంటారు. ఎందుకంటే కొన్ని అనుకోని సందర్భాలు ఎదురైనప్పుడు ఆర్ధికంగా ఇబ్బందుకు ఎదురవకూడదు అని. ప్రతిఒక్కరు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటుంటారో అలాగే మీ పిల్లలకు కూడా ఆర్ధిక భద్రత కల్పించడానికి చాల ఉపయోగపడే ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి. అందులో ఒకటి బాల్ జీవన్ బీమా యోజన అనేది పిల్లలకు ఆర్థిక భద్రత అందించడానికి ప్రభుత్వ సహకారంతో రూపొందించిన ఇన్సూరెన్స్ పథకం. తల్లిదండ్రులు రోజుకు కేవలం రూ.6 పెట్టుబడి పెట్టడం ద్వారా పిల్లలకు మంచి సురక్షితమైన భవిష్యత్తును అందించవచ్చు, అనుకోని సంఘటలు లేదా ఊహించని పరిస్థితులు ఎదురైతే ఇలాంటప్పుడు మీకు రూ.1 లక్ష ఇన్సూరెన్స్ హామీ ఇస్తుంది. చాల ఇన్సూరెన్స్ పాలసీలలాగ కాకుండా ఈ స్కిం కోసం పిల్లలకు వైద్య పరీక్ష అవసరం లేదు.
ఈ పథకం ఆర్థికంగా వెనుకబడిన అలాగే పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచాలనుకునే కుటుంబాల కోసం ప్రత్యేకంగా రూపొందించింది. అంతేకాదు దీని వల్ల ఆర్థికంగా వెనుకబడిన గ్రూపుల పిల్లలకు అందుబాటులో ఉంది, అలాగే వీరికి అత్యంత అత్యవసరమైనప్పుడు ఆర్థిక సహాయం అందేలా చేస్తుంది. RPLI (రురల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్)పాలసీ ఉన్న తల్లిదండ్రుల పిల్లల కోసం రూపొందించిన ఈ పథకం 5 నుండి 20 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకి కవర్ చేస్తుంది, ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు పిల్లలు ఈ పథకం కింద అర్హులు. ఈ పథకంలో పిల్లలను రిజిస్టర్ చేయడానికి తల్లిదండ్రులు (పాలసీదారుడు) RPLI పాలసీదారులై ఉండాలి.

బాల్ జీవన్ బీమా యోజన అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి తక్కువ ప్రీమియం ఖర్చు. రోజుకు కేవలం రూ. 6 నుండి అంటే నెలకు రూ.180తో తల్లిదండ్రులు వారి పిల్లలకు మంచి ఆర్థిక రక్షణ అందించవచ్చు. పాలసీదారుడు (సంరక్షకుడు) దురదృష్టవశాత్తు మరణిస్తే వారి బిడ్డకు రూ. 1 లక్ష పూర్తి ఇన్సూరెన్స్ మొత్తం లభిస్తుంది. ఈ మొత్తం పిల్లల చదువు ఇంకా భవిష్యత్తు అవసరాలను ఉపయోగపడుతుంది. కొన్ని ప్లాన్స్ పిల్లలకి పాక్షిక ప్రయోజనాలను లేదా విద్యా సహాయాన్ని అందిస్తాయి.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడం కూడా చాలా సులభం. ఆసక్తిగల తల్లిదండ్రులు ఈ పథకాన్ని అందించే వారి సమీపంలోని LIC ఆఫీస్ లేదా ఇన్సూరెన్స్ ప్రొవైడర్'ని సంప్రదించవచ్చు. కొన్ని ఆర్థిక సంస్థలు అలాగే బ్యాంకులు రిజిస్ట్రేషన్స్ ఫెసిలిటీ కల్పిస్తాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి దరఖాస్తుదారులు గుర్తింపు, ఆదాయ రుజువు, పిల్లల బర్త్ సర్టిఫికెట్ వంటి డాకుమెంట్స్ అందించాల్సి ఉంటుంది.
తల్లిదండ్రులందరికీ పిల్లల ఆర్థిక భద్రత అనేది అత్యంత ప్రాధాన్యతమైనది. ఈ పథకం చాలా అందుబాటులో ఉండే ఖర్చుతో అధిక ప్రయోజనాలను అందిస్తుంది. భవిష్యత్తులో వచ్చే అనిశ్చితుల గురించి ఆందోళన చెందే బదులు తల్లిదండ్రులు పిల్లల విద్య ఇంకా ప్రాథమిక అవసరాలు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. ఈ స్కిం ప్రభుత్వ సహకార పథకం కాబట్టి, ప్రైవేట్ ఇన్సూరెన్స్ వారితో పోలిస్తే చాల నమ్మకమైనది అలాగే హామీ అందిస్తుంది. ప్రతిరోజు చిన్న మొత్తంతో కష్ట సమయాల్లో కూడా మీ బిడ్డ ఆర్ధిక భద్రతని మీరు సృష్టించవచ్చు. మీరు బడ్జెట్-ఫ్రెండ్లీ ఇన్సూరెన్స్ పథకం కోసం చూస్తున్నట్లయితే, ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవడం విలువైనది. ఎందుకంటే మీరు ఊహించని లేదా అనుకోని పరిస్థితుల్లో కూడా ఇలాంటి స్కింలు ఆర్ధికంగా ధైర్యాన్ని ఇస్తాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications