Wipro News: టెక్ దిగ్గజం విప్రోకు పెద్ద షాక్..! కొత్త ప్రణాళికతో కంపెనీ ముందుకు..
Wipro: 2023లో టాప్ టెక్ దిగ్గజం విప్రో గడ్డు కాలాన్ని చూస్తోంది. టాప్ లెవల్ నిపుణులు కంపెనీని వీడటం.. ఇతర ప్రత్యర్థి కంపెనీల్లో కీలక పదవులను అధిరోహించటం కంపెనీని అతలాకుతలం చేస్తోంది.
తాజాగా డిసెంబర్ 8, 2023న కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ స్టెఫానీ ట్రాట్‌మన్ రాజీనామా చేశారు. ఆమె డిసెంబర్ 31 నుంచి కంపెనీని వీడుతున్నారు. అయితే వాస్తవానికి కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీస్ (CGO)ను పునర్నిర్మిస్తున్న తరుణంలో తాజా చర్య వచ్చినట్లు తెలుస్తోంది. కంపెనీ గతంలో CGO కింద ఉన్న స్ట్రాటజిక్ పర్స్యూట్స్ టీమ్‌ను స్ట్రాటజిక్ మార్కెట్ యూనిట్లను ఏకీకృతం చేయడం ప్రారంభించింది.

ఇలా చేయటం ద్వారా విప్రో సీజీవో అభివృద్ధి చేసిన ప్రక్రియలు, విధానాలను రూపొందించడానికి, ఈ అనుభవజ్ఞులైన బృందాన్ని క్లయింట్‌లకు, ఆన్-ది-గ్రౌండ్ సేల్స్ టీమ్‌లకు చేరువ చేసేందుకు కంపెనీని అనుమతించినట్లు CEO, MD థియరీ డెలాపోర్టే వెల్లడించారు. ప్రస్తుతం చేస్తున్న ఇంటిగ్రేటెడ్ విధానం తమకు కొత్త వృద్ధి అవకాశాలను వెలికితీయడంలో సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పైగా మార్కెట్లో మరింత వేగంగా విజయవంతమైన డీల్స్ కుదుర్చుకునే రుటును మెరుగుపరుస్తుందని కంపెనీ నమ్ముతోంది.
ప్రస్తుతం కంపెనీని వీడుతున్న ట్రాట్‌మన్ యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్నారు. ఆమె 3 ఏళ్ల క్రితం విప్రోలో చేరారు. ఆమె హైపర్-గ్రోత్ పార్ట్‌నర్‌లతో విప్రో సంబంధాలను, సలహాదారులు, విశ్లేషకుల ద్వారా మార్కెట్ ఇంటెలిజెన్స్‌ను అందిస్తుంది. విప్రో బ్రాండ్ అవగాహనను మెరుగుపరుస్తుంది. అలాగే సేల్స్ సామర్థ్యాలను అభివృద్ధి చేస్తుంది. విప్రోలో చేరడానికి ముందు ట్రాట్‌మన్ యాక్సెంచర్‌లో 7 సంవత్సరాలు వివిధ స్థాయిల్లో పనిచేశారు. విప్రోలో 21 ఏళ్ల పాటు పనిచేసిన జతిన్ దలాల్ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పదవి నుంచి వైదొలిగిన రెండు నెలల తర్వాత ట్రౌట్‌మన్ రాజీనామా వచ్చింది.


Click it and Unblock the Notifications