Chidambaram: మోదీ ప్రధానిగా కొనసాగిన కాలంలో సాధించిన విజయాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక కథనాన్ని రాశారు. దీనిపై కాంగ్రెస్ నేత మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం స్పందించారు.
మోదీ సర్కార్ గత యూపీఐ ప్రభుత్వ భుజాలపై నిలబడిందని అన్నారు. ప్రతి ప్రభుత్వ హయాంలో జరిగే కొన్ని విజయాలను సాధిస్తుంటాయని చిదంబరం తెలిపారు. దాదాపు 10 ఏళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం కొన్ని రంగాల్లో విజయానికి యూపీఏ ప్రభుత్వ భుజస్కంధాలపై నిలబడడమే కారణమన్నారు. మోదీ ప్రభుత్వం చేస్తున్న పనులకు అంతరాయం కలిగించటానికి, వాటిని ఆలస్యం చేయటానికి కోర్టుల్లో పిటిషన్లు వేశాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కోసం రాసిన కథనంలో తెలిపారు.

జీఎస్టీ, ఆర్టికల్- 370 రద్దు, వ్యాక్సినేషన్, ట్రిపుల్ తలాక్, సెంట్రల్ విస్టాతో సహా 15కి పైగా కేసుల్లో కాంగ్రెస్ కోర్టుల్లో ఓటమిపాలైనట్లు ఆమె తెలిపారు. ఈ కేసుల కోసం కోర్టులలో గడిపిన సమయమంతా 2014 నుండి మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్న తొమ్మిదేళ్ల కంటే తక్కువ సమయంలో లక్ష్యాలను సాధించడానికి ఉపయోగించుకోవచ్చని తెలిపారు. దీనిపై చిదంబరం స్పందిస్తూ.. పార్లమెంటు చట్టాన్ని ఆమోదించడానికి ముందే త్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమని సుప్రీం కోర్టు ప్రకటించిందన్నారు. ఆర్టికల్- 370 కేసును ఇంకా కోర్టు విచారించలేదని తెలిపారు. అలాగే జీఎస్‌టీ చట్టాల కింద అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తప్పుడు సమాచారం ఇవ్వటంపై కౌంటర్ ఇచ్చారు.
అలాగే పండ్లు, కూరగాయలు, పాలు, పౌల్ట్రీ, తేనె ఉత్పత్తిలో అగ్రగామిగా భారత్ ఉందని నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనపై కూడా ఆయన స్పందించారు. అయితే ఈ ర్యాంకులన్నీ ఏళ్ల కిందటే సాధించబడ్డాయని చిదంబరం తెలిపారు. ఇదే సమయంలో ఆధార్ కార్డులను దేశంలో తొలుత రూపొందించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అలాగే ప్రజలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ కింద నేరుగా నిధుల బదిలీని మెుదట యూపీఏ చేపట్టిన విషయాన్ని ప్రస్తుత ఆర్థిక మంత్రి మర్చిపోరంటూ చిదంబరం తెలిపారు.
పరిశుభ్రతను పెంపొందించే క్రమంలో భాగంగా 11.72 కోట్ల మరుగుదొడ్లను నిర్మించినట్లు నిర్మలమ్మ చేసిన ప్రకటనపై స్పందిస్తూ.. వాటిలో నీటి సౌకర్యం లేక ఎన్ని వినియోగంలో లేవో ఆర్థిక మంత్రి తన స్వంత ప్రభుత్వ నివేదికలను చదవుకోవాలని చిదంబరం కామెంట్ చేశారు. రానున్న 25 ఏళ్లలో భారత్ డెడికేటెడ్, అవినీతి రహిత పాలన ద్వారానే వేగంగా ముందుకు సాగగలదని అన్నారు.


Click it and Unblock the Notifications