ఆదివారం రాగానే ఇంట్లో చికెన్ లేదంటే ముద్ద దిగదు చాలా మందికి. కానీ... ఇప్పుడు మార్కెట్లో చికెన్ కొనాలంటే ముందు పరుసును ఒకటికి రెండు సార్లు తడుముకోవాల్సి వస్తోంది. సరిగ్గా రెండు నెలల క్రితం కరోనా వైరస్ ప్రభావంతో తీవ్రంగా పడిపోయిన చికెన్ ధరలు... ఇప్పుడు అదే కరోనా వైరస్ కారణంగా చరిత్రలో కనీ వినీ ఎరుగని రికార్డు స్థాయికి చేరుకున్నాయి. చికెన్ కోసం షాపులు వెళ్లి బిల్లు కట్టేప్పుడు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. మనం కొంటున్నది చికెనా లేదా మటనా అన్నంత అనుమానం కలుగుతోంది. దేశంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ పౌల్ట్రీ ఉత్పత్తులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటున్నప్పటికీ ... మన దగ్గర కూడా చికెన్ ధరలు ఇంతలా పెరగటం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. తక్కువ ధరలో మంచి ప్రోటీన్ లభించటంతో పాటు ఇతర జంతు మాంసం (రెడ్ మీట్) తో పోల్చితే తక్కువ కొవ్వు శాతం ఉండే చికెన్ ఆరోగ్యానికి కూడా మంచిది. అందుకే, డైట్ చేస్తున్న వారు, ఊబకాయులు సైతం చికెన్ ను పరిమితంగా తీసుకుంటే ఇబ్బంది లేదని నిపుణులు సూచిస్తారు. అందుకే పిల్లలకు, పెద్దలకు ఎంతో ఇష్టమైన చికెన్ ఇప్పుడు అందరికీ అందనంత దూరంగా వెళుతోంది.

కిలో రూ 300...
చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. సరిగ్గా 15-20 రోజుల్లోనే కిలో చికెన్ ధరలు రూ 200 నుంచి రూ 300 కు పెరిగాయి. రెండు నెలల క్రితం కిలో చికెన్ రూ 20 కి లభించిన విషయం తెలిసిందే. అప్పుడేమో ప్రజలు చికెన్ వినియోగం వల్ల కరోనా వైరస్ వస్తుందన్న మూఢనమ్మకంతో తినేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో డిమాండ్ పడిపోయి ఒక్క సరిగా పౌల్ట్రీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. కానీ, ఇంతలోనే పరిస్థితులు మారిపోయాయి. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవటానికి మంచి ప్రోటీన్ తో కూడిన డైట్ అవసరమని భావిస్తుండటంతో ప్రజలు చికెన్ విపరీతంగా తినేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగి మార్కెట్లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కిలో చికెన్ రూ 300 స్థాయికి చేరుకోవటం చరిత్రలో ఇదే తొలిసారి అని పౌల్ట్రీ రంగ నిపుణులు చెబుతున్నారు.

ఇంకా పెరుగుతాయి...
ఇప్పటికే ధరలు పెరిగి వినియోగదారులు బెంబేలెత్తి పోతుంటే... పౌల్ట్రీ వ్యాపారాలు, నిపుణులు మాత్రం ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఇందుకు ఒక కారణం వినియోగదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్ కాగా... రెండోది పౌల్ట్రీ ఫార్మ్స్ లో తగినన్ని కోళ్లు అందుబాటులో లేకపోవటం అని చెబుతున్నారు. దీంతో, కిలో చికెన్ రూ 350 కి వెళ్లినా ఆశ్చర్య పోనక్కరలేదని అంటున్నారు. అదే జరిగితే ఇక వినియోగదారులు కాస్త వెనక్కి తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. సాధారణంగా ఐతే వేసవి కాలంలో వేడి తీవ్రతకు పెద్ద ఎత్తున కోళ్లు మృత్యువాత పడుతాయి. దాంతో సప్లై తగ్గుతుంది. అదే సమయంలో వేడి చేస్తుందన్న అనుమానాలతో ప్రజలు చికెన్, గుడ్ల వినియోగం తగ్గిస్తారు. అలా రేట్లు కూడా తగ్గుతాయి. కానీ, ఈ సమ్మర్ పూర్తిగా విభిన్నంగా కనిపిస్తోంది.

భారీ తేడా...
వాస్తవానికి ఫార్మ్ గేటు వద్ద కిలో చికెన్ రూ 150 మాత్రమే ఉంది. అదే రిటైల్ గా విక్రయించాలంటే రూ 172 మేరకు ధర పలుకుతోంది. కానీ... చికెన్ షాపుకు వచ్చే సరికి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రెస్ చేసిన కోడి మాంసం కిలో కు రూ 249 వరకు, స్కిన్ లెస్ చికెన్ రూ 284 ధర నిర్ణయించారు. అయితే, చాలా మంది చికెన్ షాపుల యజమానులు దీనికి మరో రూ 10-15 జోడించి రూ 300 చొప్పున విక్రయిస్తున్నారు. మార్కెట్లో 90% షాపుల్లో ధరలు కిలో రూ 290 పలుకుతుండటం గమనార్హం. అయితే, ప్రభుత్వం కిలో చికెన్ రూ 257 కు మించి విక్రయించడానికి వీల్లేదని ప్రకటించినా... క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలు జరగటం లేదు. దీంతో వినియోగదారులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. వెంటనే ప్రభుత్వం కల్పించుకుని ధరలు తగ్గించాలని పౌరులు డిమాండ్ చేస్తున్నారు. కిలో చికెన్ రూ 250 లోపు అందుబాటులో ఉంచాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications