కరోనా వైరస్ దెబ్బకు ఇండియా లో అన్నిటికన్నా ముందు పౌల్ట్రీ రంగం దెబ్బతింటోంది. ప్రాణాంతక వైరస్ రాకకు ఇతర కారణాలు ఉన్నప్పటికీ... ప్రజల్లో నెలకొన్న అపోహలతో చికెన్ ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు, తినేందుకు ఇష్టపడటం లేదు. దీంతో మన తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశమంతటా చికెన్ ధరలు భారీగా తగ్గిపోయాయి.

ధరలు ఎంత తగ్గాయంటే.. కిలో రూ.20
ధరలు ఎంత భారీగా పడిపోయాయి అంటే ప్రస్తుతం కిలో కోడి రూ 20 కే లభిస్తోంది. దీంతో పౌల్ట్రీ రంగం తీవ్ర సంక్షోభంలో పడిపోయింది. పౌల్ట్రీ రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కొన్ని ప్రదేశాల్లో అయితే ఏకంగా ఒక కోడిని రూ 10 కి కూడా ఇచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. కరోనా వైరస్ కు చికెన్ కు ఎటువంటి సంబంధం లేకపోయినా... ప్రజల్లో మాత్రం చాలా అపోహలు నెలకొన్నాయి. గతంలో వచ్చిన బర్డ్ ఫ్లూ అయితే నేరుగా కోళ్లకు సంబంధించిన వైరస్. కానీ, ప్రస్తుతం వచ్చిన కరోనా కు కోళ్లకు ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా ప్రజలు చికెన్ తింటే ఎదో అయిపోతుంది అనే భ్రమల్లో ఉంటున్నారు. సోషల్ మీడియా లో దీనిపై వస్తున్నఅసత్య ప్రచారం, మెస్సేజ్ ల ద్వారా పౌల్ట్రీ రైతులకు, పౌల్ట్రీ రంగానికి తీరని అన్యాయం జరుగుతోంది.

కేటీఆర్ స్వయంగా తిన్నా కూడా...
చికెన్ పై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కె తారక రామా రావు (కేటీఆర్) ముందుకు వచ్చారు. రెండు వారల క్రితం కేటీఆర్ తో పాటు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సహా చాలా మంది ప్రముఖులు బహిరంగంగా చికెన్ తిని చూపించారు. హైదరాబాద్ లోని నక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మీడియా సాక్షిగా వారంతా చికెన్ ఉత్పత్తులు ఇష్టంగా తిన్నారు. దాంతో కొద్ది రోజుల పాటు చికెన్ ధరలు కాస్త పెరిగి పౌల్ట్రీ రంగం ఊపిరి పీల్చుకుంది. కానీ, ఇంతలోనే ఇండియాలో నేరుగా కరోనా వైరస్ కేసులు నమోదు కావటం, అందునా హైదరాబాద్ కు కూడా అది విస్తరించటంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది.

పౌల్ట్రీ లో తెలుగు రాష్ట్రాలు కీలకం..
దేశీయ పౌల్ట్రీ రంగంలో తెలుగు రాష్ట్రాలది కీలక స్థానం. ఇండియన్ పౌల్ట్రీ రంగం మార్కెట్ పరిమాణం సుమారు రూ 40,000 కోట్లు ఉంటుంది. మొత్తం దేశ పౌల్ట్రీ అవసరాల్లో మూడో వంతు మన తెలుగు రాష్ట్రాలు తీరుస్తుంటాయి. చికెన్ కోసం కోళ్లను పెంచటం లోనైనా... కోడి గుడ్ల ఉత్పత్తి, ఎగుమతుల్లోనైనా మనదే అగ్రస్థానం. దేశంలో మొత్తం రోజుకు 21 కోట్ల కోడి గుడ్ల వినియోగం జరిగితే... ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచి రోజుకు సుమారు 7 కోట్ల గుడ్లు సరఫరా అవుతుంటాయి. అలాగే చికెన్ కోసం పెంచే కోళ్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తంగా సుమారు 50 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ రంగం సంక్షోభంలో పడితే వారికి ఉపాధి కరువు అవుతుంది. అది కేవలం వారికే కాదు... మన ఆర్థిక వ్యవస్థకు కూడా మంచి కాదు.

కూరగాయల కన్నా చీప్...
తక్కువ ధరలోనే మంచి పౌష్టికాహారం లభించేది చికెన్ లోనే. సహజంగా కిలో చికెన్ ధరలు రూ 200 స్థాయిలో ఉంటాయి. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా రేట్లు పడిపోవటంతో అవి కూరగాయల ధరల కంటే కూడా తక్కువకే అందుబాటులోకి వచ్చాయి. ఈ రోజు మార్కెట్ ధరల ప్రకారం కిలో కోడి ధర రూ 20 మాత్రమే (ఫార్మ్ గేటు వద్ద). దాన్నిరెటైల్గా విక్రయిస్తే రూ 40 చొప్పున లభిస్తోంది. అదే డ్రెస్డ్ అయితే కిలో రూ 60 కే లభిస్తోంది. స్కిన్ లెస్ (తోలు లేకుండా) అయితే కిలో రూ 69 చొప్పున లభిస్తోంది. సిటీ ని బట్టి, ప్రాంతాన్ని బట్టి ధరల్లో రూ 10 వ్యత్యాసం ఉంటుంది. కానీ, కిలో వంకాయ రూ 32 - 35, కిలో కాకరకాయ రూ 35, బీన్స్ రూ 40, కిలో బెండ కాయ రూ 40, ఉల్లిపాయ కిలో రూ 39, టమాటో కిలో రూ 19 చొప్పున లభిస్తున్నాయి. కాబట్టి, ప్రజలు అపోహలు పక్కనబెట్టి చికెన్ తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications