సరిగ్గా నెల రోజుల క్రితం కిలో కోడి కూర ధర రూ 20 మాత్రమే. ఇండియా లో లాక్ డౌన్ ప్రకటించక ముందు చైనా లో వైరస్ వస్తే... ఇక్కడ చికెన్ ధరలు పడిపోయాయి. కరోనా వైరస్ పక్షులు, జంతువుల ద్వారా సంక్రమిస్తోందన్న అనుమానాల నేపథ్యంలో మన దేశంలో చికెన్ కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకు రాలేదు. దీంతో విపరీతంగా డిమాండ్ పడిపోయి ధరలు భారీగా తగ్గిపోయాయి. కిలో కోడిని రూ 20 కే ఇచ్చినా తీసుకునేందుకు ముందుకు రాని పరిస్థితి. కానీ ప్రజల్లో నెలకొన్న భయాలను పారదోలేందుకు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముందుకు వచ్చారు.
ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తో కలిసి హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా లో ప్రజా సమక్షంలో చికెన్ తిని చూపించారు. చికెన్ కు కరోనా వైరస్ కు సంబంధం లేదని, పైగా కరోనా వైరస్ వంటి రోగాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండాలంటే చికెన్ తినాలని అయన ప్రజలకు సూచించారు. దీంతో ప్రజల్లో చాలా వరకు మార్పొచ్చింది. క్రమంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ కు డిమాండ్ పెరిగింది. గతంలో బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి కూడా సరిగ్గా ఇలాగే చికెన్ తిని ఆదర్శంగా నిలిచిన విషయం తెలిసిందే.

పెరిగిన వినియోగం...
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో పౌల్ట్రీ పరిశ్రమ భారీ స్థాయిలో విస్తరించి ఉంది. అటు బ్రాయిలర్, ఇటు లేయర్ కోళ్ల పెంపకంలో మన తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ముందు ఉంటాయి. మొత్తం దేశానికి అవసరమైన పౌల్ట్రీ ఉత్పత్తుల్లో మూడో వంతు మన రెండు రాష్ట్రాల నుంచే సమకూరుతాయి. దేశంలో రోజుకు 21 కోట్ల కోడి గుడ్ల వినియోగం జరుగుంటే... మన తెలుగు రాష్ట్రాలు రోజుకు 7 కోట్ల నుంచి 8 కోట్ల గుడ్లను సరఫరా చేస్తున్నాయి. అలాగే బ్రాయిలర్ కోళ్ల పెంపకం, వినియోగం కూడా మన వద్ద అధికంగానే ఉంటుంది. కరోనా వైరస్ వల్ల ఫిబ్రవరి, మార్చిలో దెబ్బతిన్న పౌల్ట్రీ రంగం .. మళ్ళీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ప్రజలు కూడా భయాలను వీడి కోడి మాంసం తినేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో ప్రస్తుతం కిలో కోడి కూర ధర రూ 200 కు చేరుకుంది.

అమలు కాని ప్రభుత్వ ఆదేశాలు...
కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయి. ఇదే అదనుగా చికెన్, మటన్, ఫిష్ వంటి అన్ని రకాల ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెంచేశారు. ఒక దశలో కిలో మటన్ ఏకంగా రూ 1,000 నుంచి 1,200 కు విక్రయించారు. చికెన్ కూడా రూ 210 చొప్పున విక్రయించటం మొదలు పెట్టారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం ధరలపై నియంత్రలను పెట్టింది. చికెన్ ఐతే కిలో రూ 160, మటన్ రూ 700 కు మించి విక్రయించకూడని ఆదేశించింది. కానీ, వాస్తవంలో మాత్రం అవేమి అమలు జరగకపోవటం విచారకరం. ప్రస్తుతం మార్కెట్లో చికెన్ ధరలు రూ 200 నుంచి రూ 210 కి విక్రయిస్తున్నారు. ఇక మటన్ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

లక్షల మందికి ఉపాధి...
రెండు తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ రంగం పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. వ్యవసాయానికి అనుబంధ రంగంగా పరిగణించే పౌల్ట్రీ రంగం మెరుగైన రాబడికి మార్గం గా ఉండటంతో పెద్ద ఎత్తున ప్రజలు ఇటువైపు దృష్టి సారించారు. ఒక్క మన తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు 40-45 లక్షల మంది ప్రత్యక్షంగా పౌల్ట్రీ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. పౌల్ట్రీ ఫార్మ్స్ ఏర్పాటు, చికెన్ షాపుల నిర్వహణ, కోడిగుడ్ల హోల్ సేల్, రిటైల్ వ్యాపారాల ద్వారా ప్రజలు జీవనోపాధిని పొందుతున్నారు. లాక్ డౌన్ ఉన్నప్పటికీ... వ్యవసాయ రంగాన్ని, అలాగే పౌల్ట్రీ రంగాన్ని కూడా మినహాయించటంతో ఈ మేరకు పెద్ద సంఖ్యలో ప్రజలకు ఊరట లభించినట్లయింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications