Muhurat Trading: మరో వారం రోజుల్లో దేశంలో దీపావళి రాబోతోంది. ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లలోని చాలా మంది ఇన్వెస్టర్లు ప్రత్యేకంగా నిర్వహించే ముహురత్ ట్రేడింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. సాంవత్ 2081లో శుభప్రదంగా అడుగుపెట్టేందుకు మంచి కంపెనీల షేర్లను వెతికే పనిలో చాలా మంది పెట్టుబడిదారులు ఉన్నారు. ఈ క్రమంలో చాయిస్ ఈక్విటీ బ్రోకింగ్ సూచించిన స్టాక్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
గత ఏడాది దీపావళి తర్వాత సెన్సెక్స్, నిఫ్టీ సూచీలతో పాటు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు సైతం ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అస్థిరతలు ఉన్నప్పటికీ భారతీయ స్టాక్ మార్కెట్లు మాత్రం తమ బుల్ జోరును కొనసాగించాయి.

ముందుగా చాయిస్ బ్రోకింగ్ బజాజ్ ఆటో షేర్లకు టార్గెట్ ధరను రూ.12,483గా ప్రకటించింది. బజాజ్ దేశీయ మార్కెట్లలో సీఎన్జీ ఆధారిత ఫ్రీడమ్ మోడల్ విడుదల చేయటం మంచి సేల్స్ పెరుగుదలకు దారితీసింది. దీనికి తోడు కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో చేతక్ స్కూటర్లు భారీగా కొనుగోలుదారుల నుంచి ఆసక్తిని పొందటంతో టాప్ ఆటగాడిగా కంపెనీ నిలిచేందుకు దోహదపడిందని బ్రోకరేజ్ పేర్కొంది. ఇదే క్రమంలో డిఫెన్ రంగానికి చెందిన భారత్ డైనమిక్స్ కంపెనీ షేర్లకు రూ.1501 టార్గెట్ ధరను బ్రోకరేజ్ అందించింది. కంపెనీ పెద్ద ఆర్డర్లను పొందటంతో పాటు రక్షణ రంగానికి చెందిన అనేక ఉత్పత్తులకు విస్తరించటంపై బ్రోకరేజ్ సానుకూలంగా ఉంది. ప్రస్తుతం రూ.19500 కోట్లుగా ఉన్న ఆర్డర్ బుక్ గ్లోత్ కి దోహదపడుతుందని పేర్కొంది.
ఇదే క్రమంలో అదానీ గ్రూప్ సిమెంట్ కంపెనీ ఏసీసీ షేర్లకు బ్రోకరేజ్ రూ.2795 టార్గెట్ ధరగా పేర్కొంది. దేశంలోని ఇన్ ఫ్రా రంగంలో పెరుగుతున్న ఖర్చులు కంపెనీకి ఆదాయాన్ని తెచ్చిపడతాయని బ్రోకరేజ్ పేర్కొంది. ఇదే క్రమంలో సొమానీ సిరామాకిస్ కంపెనీ షేర్లకు బ్రోకరేజ్ టార్గెట్ ధరను రూ.965గా పేర్కొంది. ఇదే క్రమంలో ఐటీ రంగానికి చెందిన దేశీయ అతిపెద్ద టాటా గ్రూప్ కంపెనీ టీసీఎస్ షేర్లకు కంపెనీ టార్గెట్ ధరను రూ.4664గా నిర్ణయించింది. కొత్త తరం సాంకేతికతలైన ఏఐ, జెనరేటివ్ ఏఐపై కంపెనీ దృష్టి మంచి వృద్ధికా దారితీస్తుందని బ్రోకరేజ్ అంచనా వేస్తోంది. ఇదే రంగానికి చెందిన మరో దిగ్గజ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లకు రూ.2105 టార్గెట్ ధరగా ఫిక్స్ చేసింది.
ఇదే క్రమంలో రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈఎఫ్‌సీ లిమిటెడ్ కంపెనీ షేర్లకు రూ.855 టార్గెట్ ధరగా బ్రోకరేజ్ పేర్కొంది. ఈ కంపెనీ స్టార్టప్ కంపెనీలతో పాటు చిన్న మధ్యస్థ కంపెనీలకు ఆఫీస్ స్పేస్ రెంటల్స్, ఇంటీరియర్, ఫర్నీచర్ తయారీ వంటి రంగాల్లో పనిచేస్తోంది. ఇదే క్రమంలో గ్రన్యూల్స్ ఇండియా కంపెనీ షేర్లకు బ్రోకరేజ్ రూ.723 టార్గెట్ ధరగా ఫిక్స్ చేయగా, గ్లోబల్ హెల్త్ కంపెనీ షేర్లకు రూ.1246 టార్గెట్ ధరగా ఉంచింది. ఇక చివరిగా యూగ్రో క్యాపిటల్ కంపెనీ షేర్లకు చాయిస్ బ్రోకింగ్ రూ.345 టార్గెట్ ధరగా నిర్ణయించింది. దేశీయంగా పెరుగుతున్న ఎంఎస్ఎంఈ రుణ వ్యాపారం కంపెనీకి మంచి అవకాశాలను అందిస్తోందని బ్రోకరేజ్ వెల్లడించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications