తండ్రి ఆస్తిపై కూతురుకు వారసత్వంపై కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. 1956 చట్టానికి ముందు ఉన్న లా ప్రకారం.. కుమార్తెలు తండ్రి ఆస్తిలో వాటా పొందలేరని తెలిపింది. హిందూ వారసత్వ చట్టం, 1956 అమల్లోకి రాకముందే తండ్రి ఆస్తి మీద వారసత్వం ప్రారంభమైతే.. కుమార్తె తన తండ్రి ఆస్తిలో ఎటువంటి వాటాను క్లెయిమ్ చేయడానికి వీల్లేదని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు స్పష్టం చేసింది.
హిందూ వారసత్వ చట్టం, 1956 కన్నా ముందు ఉన్న వారసత్వం మితాక్షర చట్టం (Mitakshara Law) ద్వారా కొడుకే తండ్రి ఆస్తికి వారసుడు అవుతాడని తేల్చి చెప్పింది. మితాక్షర చట్టం ప్రకారం, పురుష హిందువుల ప్రత్యేక ఆస్తి, మగ వారసులు ఉన్నప్పుడు కేవలం కొడుక్కి మాత్రమే వెళ్తుంది. మగ బిడ్డ లేన్నప్పుడు మాత్రమే ఆడ బిడ్డ ఆ ఆస్తిపై హక్కు పొందగలదని తెలిపింది.

TOI నివేదిక ప్రకారం.. ఈ తీర్పు రాగ్మానియా అనే మహిళ.. తన తండ్రి ఆస్తిలో వాటా కోసం దాఖలు చేసిన కేసులో జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్ అక్టోబర్ 13న వెలువరించారు. కేసు పూర్వాపరాలు ఏంటంటే.. రాగ్మానియా సుర్గుజా జిల్లాలోని తన తండ్రి పూర్వీకుల ఆస్తిలో వాటా కోసం దావాను దాఖలు చేసింది. దిగువ కోర్టులు ఆమె వాదనను తిరస్కరించాయి. హైకోర్టు ఈ నిర్ణయాన్ని ధృవీకరించి, 1956కి ముందు మరణించిన హిందువుల ఆస్తులు మితాక్షర చట్టం ప్రకారం మాత్రమే నిర్వహించబడతాయని దిగువ కోర్టుల వాదనను సమర్థించింది.
రాగ్మానియా 2005లో తన తండ్రి సుధిన్ ఆస్తిలో టైటిల్, విభజన కోసం సివిల్ దావా పెట్టింది. ఆమె వాదన ప్రకారం, ఆమెకు ఆస్తి వారసత్వ హక్కు ఉంది. కానీ, ట్రయల్ కోర్టు, అప్పీలేట్ కోర్టులు రెండూ 1956కి ముందు ప్రారంభమైన వారసత్వంపై హిందూ వారసత్వ చట్టం వర్తించదని నిర్ధారించాయి. హైకోర్టు కూడా ఇదే నిర్ణయాన్ని తెలిపింది.
కోర్టు తీర్పులో.. 1950-51 ప్రాంతంలో మరణించిన హిందువుల ఆస్తి, మితాక్షర చట్టం ప్రకారం మగ వారసులకు మాత్రమే వెళ్తుందని స్పష్టంగా పేర్కొన్నది. సుప్రీంకోర్టు పూర్వపు తీర్పులను కూడా కోర్టు ఉదహరించింది, వీటిలో అర్ష్నూర్ సింగ్ vs హర్పాల్ కౌర్ (2020), అరుణాచల గౌండర్ vs పొన్నుసామి (2022) ఉన్నాయి. ఈ కేసులు చూపిన విధంగా.. 1956కి ముందు మరణించిన హిందువుల ఆస్తిలో, మగ బిడ్డలు ఉన్నప్పుడు ఆడ బిడ్డలకు వారసత్వ హక్కు రాదు.
జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్ తీర్పును వెలువరుస్తూ..మితాక్షర చట్టం ప్రకారం పాలించబడే ఒక హిందువు 1956కి ముందు మరణించినప్పుడు, అతని ప్రత్యేక Property పూర్తిగా అతని కొడుక్కి వెళ్తుంది. మగ బిడ్డలు ఎవరూ లేనప్పుడు మాత్రమే ఆడ బిడ్డ ఆస్తిలో హక్కు పొందగలదు. సుధిన్‌కు కొడుకు ఉన్నందున, రాగ్మానియాకు ఆస్తిలో వాటా లభించదని తేల్చి చెప్పింది.
మొత్తం మీద, హైకోర్టు తీర్పు 1956కి ముందు ప్రారంభమైన వారసత్వ సందర్భాలలో కుమార్తెలు ఆస్తిలో వాటా పొందలేరని స్పష్టంగా నిర్ధారించింది. మితాక్షర చట్టం ప్రకారం, ఆస్తి నిర్వహణ కేవలం మగ వారసులకు పరిమితం అవుతుంది. దీని ద్వారా కోర్టులు, పూర్వీకుల ఆస్తుల హక్కుల వ్యవస్థను స్పష్టతతో కూడిన తీర్పును ఇచ్చినట్లయింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications