Multibagger Stock: ఏడాదిలో 171.76 శాతం పెరిగిన షేర్.. ఇన్వెస్టర్లకు లాభాలు కురిపిస్తున్న ప్రభుత్వ కంపెనీ..
Multibagger Stock: మల్టీబ్యాగర్ షేర్లలో పెట్టుబడి మంచి రాబడిని ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. దానితో రిస్క్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. కానీ.. కొంత రీసెర్చ్, మార్కెట్లపై అవగాహన ఉంటే చాలా మీరు సరైన స్టాక్ ఎంచుకుని మంచి రాబడులను పొందవచ్చు. ఇలా తన ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందిస్తున్న కంపెనీగా చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (CPCL) షేర్ నిలిచింది. ఈ వారం ప్రారంభంలో కేవలం మంగళవారం ఒక్క రోజే షేర్ 20 శాతం దూసుకెళ్లింది. మే 31 నుంచి షేర్ నిరంతరం పెరుగుతూనే ఉంది.
లాభాల్లో రాకెట్ లా దూసుకెళుతోంది..
మార్చి 31, 2022తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆకట్టుకునే ఆర్థిక ఫలితాలను కూడా పోస్ట్ చేసింది. కంపెనీ క్వార్టర్ ఏకీకృత ఆర్థిక గణాంకాల ప్రకారం Q4FY2022 నిర్వహణ లాభం రూ. 1,594.40 కోట్లుగా ఉంది. Q4FY2021 క్వార్టర్ లో నిర్వహణ లాభం రూ.550.94 కోట్లుగా ఉంది.
అంటే ఈ ఏడాది దాదాపు189.40 శాతం పెరిగింది. Q4FY2022 నికర అమ్మకాలు రూ. 20,997.13 కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 14,705.48 కోట్ల అమ్మకాలను కంపెనీ నమోదు చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ. 2 చొప్పున ఈక్విటీ డివిడెండ్‌ను కూడా డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది.

ఏడాదిలో 171.76 శాతం పెరిగిన షేర్ విలువ:
చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ను.. గతంలో మద్రాస్ రిఫైనరీస్ లిమిటెడ్ అని పిలిచేవారు. 1965లో భారత ప్రభుత్వం, AMOCO, నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ కలిపి దీనిని స్థాపించాయి. ఈ కంపెనీలో భారత ప్రభుత్వానికి ఏకంగా 74 శాతం వాటా ఉంటగా మిగిలిన రెండు సంస్థలకు 13 శాతం చొప్పున వాటా ఉంది. వివిధ పెట్రోలియం ఉత్పత్తులను.. ఉత్పత్తి చేయడానికి & సరఫరా చేయడానికి అవసరమైన ముడి చమురును శుద్ధి చేసే వ్యాపారంలో కంపెనీ ఉంది. గత వారంలోనే కంపెనీ షేర్లు 27 శాతం పెరిగాయి. బిఎస్‌ఈలో ఏడాది కాలంలో షేర్ ఏకంగా 171.76 శాతం లాభపడింది. భవిష్యత్తుల్లోనూ ఈ మల్టీబ్యాగర్ స్టాక్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇన్వెస్టర్లు ఈ స్టాక్ పనితీరుపై ఓ కన్నేసి ఉంచటం మంచిదే.


Click it and Unblock the Notifications