దక్షిణ భారతదేశంలో హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్ విస్తరణ మరింత వేగాన్ని పుంజుకుంటోంది. ప్రతిపాదిత చెన్నై-హైదరాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ ఇప్పుడు కీలక దశకు చేరుకుందని రైల్వే వర్గాలు వెల్లడించాయి. మొత్తం 778 కిలోమీటర్ల పొడవుతో ప్లాన్ చేయబడిన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి సవరించిన మార్గ అలైన్‌మెంట్‌ను దక్షిణ మధ్య రైల్వే (SCR) ఇటీవల ఖరారు చేసి తమిళనాడు ప్రభుత్వానికి ఆమోదం కోసం సమర్పించింది.
ముందుగా ఈ మార్గం గూడూరు వైపు వెళ్లే విధంగా రెడీ చేయబడింది. అయితే తమిళనాడు ప్రభుత్వం తిరుపతిని కీలక స్టేషన్‌గా చేర్చాలని కోరడంతో మార్గాన్ని తిరిగి పునర్‌వ్యవస్థీకరించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సవరించిన ప్రతిపాదనను ఆమోదించిన తర్వాత నెలరోజుల వ్యవధిలో వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (DPR) పూర్తి చేయనున్నట్లు SCR ప్రకటించింది. సవరించిన అలైన్‌మెంట్‌ను తమిళనాడు రవాణా శాఖతో కూడా పంచుకున్నారు.

భూసేకరణ ప్రక్రియకు మద్దతు తెలిపి ఈ కారిడార్‌ను రాష్ట్ర దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్‌లో చేర్చాలని కేంద్ర రైల్వే అధికారులు అభ్యర్థించారు. కన్సల్టెన్సీ సంస్థ RITES ఇచ్చిన ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ అమలు కోసం తమిళనాడులో సుమారు 223.44 హెక్టార్ల భూమి అవసరం అవుతుంది. భూసేకరణకు ప్రతిబంధకాలు తక్కువగా ఉండేలా పర్యావరణ పరిరక్షణ దృష్టితో కూడా ప్రణాళిక రూపుదిద్దుకుంది. ముఖ్యంగా గుర్తించిన భూభాగాల్లో ఏవీ అటవీ ప్రాంతాల్లోకి రానందున పర్యావరణ అనుమతులు త్వరగా లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
నిర్మాణ సమయంలో మొత్తం 65 ప్రధాన రహదారులు, 21 హై-వోల్టేజ్ విద్యుత్ లైన్లను దాటాల్సి రావడంతో అనేక శాఖలతో సమన్వయం అవసరమని రైల్వే అధికారులు పేర్కొన్నారు. చెన్నై నగరంలో రెండు Bullet Train స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రణాళిక ఉంది. ఒకటి చెన్నై సెంట్రల్ సమీపంలో, మరొకటి మింజూర్ ప్రాంతంలో చెన్నై రింగ్ రోడ్ వెంట. ప్రతి స్టేషన్ నిర్మాణానికి కనీసం 50 ఎకరాల విస్తీర్ణం అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ రెండు కేంద్రాలను చుట్టూ రవాణా ఆధారిత అర్బన్ డెవలప్‌మెంట్ (TOD) విధానంతో కొత్త వాణిజ్య కేంద్రాలను ఏర్పరచాలని రైల్వేలు సిఫార్సు చేస్తున్నాయి. అదనంగా, తమిళనాడు సెక్షన్‌లో మొత్తం 11.6 కిలోమీటర్ల సొరంగ మార్గం కూడా ఉంటుంది. దీని కోసం అత్యంత జాగ్రత్తగా భూ-సాంకేతిక (జియోటెక్నికల్) పరిశోధనలు చేయాల్సి ఉంటుంది.ఈ మార్గ రూపకల్పనలో పాండవాక్కం, థాచూర్, విచూర్, మాథుర్, తొండియార్‌పేట్ వంటి ఉత్తర చెన్నై ప్రాంతాల సమీపంలో నిర్మాణం జరిగే అవకాశం ఉండడంతో స్థానిక జనాభాకు అంతరాయం లేకుండా ఏర్పాటు చేయడానికి జాగ్రత్తగా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత చెన్నై, హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయం ప్రస్తుత 12 గంటల నుండి కేవలం 2 గంటల 20 నిమిషాలకు తగ్గుతుందని అంచనా. రైల్వే అధికారులు రాష్ట్ర బృందాలతో కలిసి క్షేత్రస్థాయి తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. తద్వారా తుది స్థాన సర్వేలో జాప్యం జరగకుండా చూడవచ్చని చెప్పారు. ఈ ప్రాజెక్టు దక్షిణ ప్రాంతంలో ప్రతిపాదిత రెండు ప్రధాన హై-స్పీడ్ కారిడార్లలో ఒకటి. మరొకటి హైదరాబాద్-బెంగళూరు మార్గం.
ఈ రెండు మార్గాలు భారతదేశ బుల్లెట్ రైలు నెట్వర్క్‌ను ముంబై-అహ్మదాబాద్ కారిడార్ దాటి విస్తరించి, దక్షిణాది ప్రాంతంలోని ఆర్థిక, పరిశ్రమ కేంద్రాలను సమర్థవంతంగా అనుసంధానించేందుకు రూపొందించిన జాతీయ వ్యూహంలో భాగం. ఈ కారిడార్ సర్వేలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఈ బుల్లెట్ రైల్వే లైన్ హైదరాబాద్, చెన్నై, అమరావతి, బెంగళూరును అనుసంధానించబోతోందని ప్రకటించడం ఈ కార్యక్రమానికి మరింత ఊపునిచ్చింది. ఈ ప్రాజెక్టు అమలయితే దక్షిణాది రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. పర్యాటకం, వ్యాపారం, పెట్టుబడులు, ప్రాంతీయాభివృద్ధికి ఇది కొత్త దారులను తెరుస్తుందని భావిస్తున్నారు.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications