Rolls Royce: ఖరీదైన కార్లకు దేశంలో మస్తు డిమాండ్ ఉంది. స్టేటస్ సింబల్ గా భావించే రోల్స్ రాయిస్ కి అయితే ఏకంగా పలువురు ఫ్యాన్స్ ఉన్నారు. కేవలం కారు పెయింటింగ్ కోసం అంబానీ కుటుంబం దాదాపు 2 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. తాజాగా భారత్ చేరిన ఈ EV మోడల్ ఫొటోలు నెట్టింట హల్ చేల్ చేస్తున్నాయి.
రోల్స్ రాయిస్ కు చెందిన స్పెక్టర్ మోడల్ మన దేశంలో ఇంకా అధికారికంగా లాంచ్ కాలేదు. అయితే కొన్ని రోజుల క్రితమే ఈ కారు ఇండియాలో డెలివరీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. చెన్నైకి చెందిన బిల్డర్, భాష్యం కన్‌స్ట్రక్షన్స్ యజమాని యువరాజ్.. ఈ విలాసవంతమైన సూపర్ కారుని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

బ్రిటిష్ లగ్జరీ బ్రాండ్ నుంచి రోల్స్ రాయిస్ స్పెక్టర్ పేరిట మొదటి ఎలక్ట్రిక్ వాహనం రిలీజ్ అయింది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు 9 కోట్లు కాగా.. ఆన్-రోడ్ ప్రైస్ 10.5 కోట్లుగా ఉంది. 23 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఇందులో ప్రత్యేక ఆకర్షణ నిలుస్తున్నాయి. దీనికి తోడు వెనుక డిజైన్ సరళమైన స్టైలిష్ LED టైల్ లైట్లతో, పదునైన స్లాంటెడ్ రూఫ్ కలిగి ఉంది.
స్టార్ లైట్ లైనర్ ఇప్పటివరకు టాప్ కు మాత్రమే పరిమితం కాగా.. తొలిసారి దీన్ని డోర్ ప్యాడ్లకు సైతం విస్తరించారు. ప్యాసింజర్ సైడ్ డ్యాష్ బోర్డ్ ప్యానెల్ 'స్పెక్టర్' నేమ్ ప్లేట్ తో మిరుమిట్లు గొలుపుతోంది. అయితే కారు రన్నింగ్ లో లేనప్పుడు పూర్తిగా కనిపించని విధంగా మేకర్స్ డిజైన్ చేశారు. దీని బరువు దాదాపు 3 టన్నులు ఉన్నప్పటికీ, కేవలం 4.5 సెకన్లలో 100 kmph వేగాన్ని అందుకోగలదు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!



Click it and Unblock the Notifications