MRF Shares: దేశీయ స్టాక్ మార్కెట్లలో క్యూ4 ఫలితాల కోలాహలం లాభాలను అందిస్తోంది. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లు ఊహించని రీతిలో కంపెనీ ఒక్కో షేరుపై రూ.194 డివిడెండ్ అందిస్తోంది. ఈ కంపెనీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది భారతీయ స్టాక్ మార్కెట్లలోనే అత్యంత ఖరీదైన స్టాక్ గురించి. అవును మనం ఎమ్ఆర్ఎఫ్ స్టాక్ అందిస్తున్న డివిడెండ్ ప్రకటన గురించి ఇప్పుడు వింటున్నది. ప్రస్తుతం ఒక్కే షేరుపై రూ.194 భారీ డివిడెండ్ ప్రకటించిన కంపెనీ గతంలో కేవలం షేరుకు రూ.3 మాత్రమే ప్రకటించటం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. స్టాక్ ధరకు అది అందిస్తున్న డివిడెండ్ ఆదాయానికి ఎక్కడా పొంతనలేదంటూ చాలా మంది అప్పట్లో కామెంట్స్ చేశారు.

కంపెనీ బోర్డు రూ.10 ముఖ విలువ కలిగిన MRF షేర్లకు సుమారుగా 1940% డివిడెండ్‌ను సిఫార్సు చేసింది. దీంతో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో షేరుపై రూ.194 ఫైనల్ డివిడెండ్ అందిస్తున్నట్లు కంపెనీ శుక్రవారం ప్రకటించి ఇన్వెస్టర్లను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికే రెండు సారు ఆర్థిక సంవత్సరంలో రూ.3 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించగా.. తాజాగా మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.194 డివిడెండ్ ప్రకటించటంతో మెుత్తం ఏడాదికి రూ.200 ఒక్కో షేరుపై డివిడెండ్ చెల్లించబడింది.
అలాగే కంపెనీ క్యూ4 ఆర్థిక ఫలితాలను పరిశీలిస్తే.. నికర లాభం ఏడాది ప్రాతిపదికన 16 శాతం పెరిగి రూ.396 కోట్లుగా నమోదైంది. ఇది అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ.341 కోట్లుగా ఉంది. అలాగే ఆదాయం మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.6,349 కోట్లకు చేరుకుంది. అలాగే ఈ కాలంలో కంపెనీ ఖర్చులు ఏడాదికి 9 శాతం పెరిగి రూ.5,916 కోట్లకు చేరుకుంది.
తమిళనాడులోని చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న టైర్ల తయారీ సంస్థ దేశంలో అగ్రగామిగా కొనసాగుతోంది. ప్రస్తుతం కంపెనీ షేర్లు దేశీయ స్టాక్ మార్కెట్లలో అత్యంత ఖరీదైన షేరుగా కొనసాగుతోంది. అలాగే కంపెనీ ఒక్కో షేరు ధర ప్రస్తుతం రూ.లక్ష మైలురాయిని అధిగమించి కొనసాగుతోంది. కంపెనీ త్రైమాసిక ఫలితాలకు ముందే ఇన్వెస్టర్లు షేర్లను విక్రయించడంతో శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి స్టాక్ 4.06 శాతం క్షీణించి ఒక్కోటి రూ.1,28,495 రేటు వద్ద ప్రయాణాన్ని ముగించింది. అలాగే MRF స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర ఏకంగా ఒక్కోటి రూ.1,51,283 తాకి అందరినీ షాక్‌కి గురిచేసింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications