Team Detailing Solutions: దసరా, దీపావళి దగ్గరపడుతున్న వేళ దేశంలోని కొన్ని వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులకు ఊహించని బహుమతులను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక ఐటీ సేవల కంపెనీ తాజాగా ఉద్యోగులకు బైక్స్, కార్లు బహుకరించటం దేశంలోని టెక్కీల్లో పెద్ద చర్చకు దారితీసింది. పేరున్న పెద్ద టెక్ కంపెనీలు తమ స్వలాభాలను చూసుకుంటాయే కానీ ఎప్పుడూ ఉద్యోగులకు ఇలాంటి బహుమతులు అందించిన సందర్భాలు ఇప్పటి వరకు కనిపించలేదు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న టీమ్ డీటెయిలింగ్ సొల్యూషన్స్ కంపెనీ గురించే. పండుగ సమయంలో కంపెనీ తన ఉద్యోగులకు 28 కార్లు, 29 బైక్‌లను బహుమతిగా ఇచ్చింది. ఇది ఉద్యోగుల్లో ప్రేరణను నింపటంతో పాటు ఉత్పాదకతను పెంచుతుందని కంపెనీ భావిస్తోంది. వాస్తవానికి 2005లో ప్రారంభించబడిన టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ స్ట్రక్చరల్ స్టీల్ డిజైన్, డిటైలింగ్ సేవలను అందిస్తోంది. ఇందుకోసం కంపెనీ ఆటో క్యాడ్, టెక్లా, మ్యాత్ క్యాడ్, డెస్కాన్, ఆఫీస్ డాక్యుమెంట్ వంటి సాంకేతికతలను వినియోగిస్తోంది.

ఉద్యోగులకు బహుమతులు అందించటంపై కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ కణ్ణన్ మీడియాతో మాట్లాడుతూ.. వారి కష్టాన్ని గుర్తించి, అభినందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రతి కంపెనీ ఏటా వారి ఉద్యోగుల పనితీరును వివిధ మెట్రిక్స్ ద్వారా కొలుస్తుంటాయి. అదే విధందా నిబద్ధత అంకితభావంతో పనిచేసిన తమ ఉద్యోగులను గుర్తించి వారికి బహుమతులు అందించటంపై గర్విస్తున్నట్లు శ్రీధర్ పేర్కొన్నారు. దీనికి ముందు 2022లో సైతం కంపెనీ ఇద్దరూ సీనియర్ ఉద్యోగులకు కార్లను బహుమతిగా అందించింది. అయితే ప్రస్తుతం అందిస్తున్న 28 కార్లలో కొన్ని మారుతీ సుజుకీలు, హ్యుందాయ్‌లు, మెర్సిడెస్ బెంజ్ కూడా ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.
కంపెనీ బహుమతిగా ఇచ్చే కారు లేదా బైక్‌కు ఏదైనా సీలింగ్ అమౌంట్ ఉందాపై స్పందిస్తూ.. ఉద్యోగికి కంపెనీ అందిస్తున్న దానికంటే మెరుగైన వాహనం అవసరమని భావిస్తే వారు మిగిలిన మొత్తాన్ని చెల్లించాలి నచ్చిన వాహనాన్ని తీసుకునేం ొదుకు కంపెనీ వెసులుబాటు కల్పించిందని మేనేజ్మెంట్ వెల్లడించింది. టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ కంపెనీలకు కారు, బైక్స్ బహుకరించటంతో పాటు ఉద్యోగి వివాహానికి గతంలో అందిస్తున్న రూ.50 వేల సాయాన్ని ప్రస్తుతం రూ.లక్షకు పెంచింది. ఉద్యోగుల సంక్షేమానికి కంపెనీ ప్రధమ ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా మంచి వర్క్ కల్చర్, వాతావరణం, కంపెనీపై అటాచబులిటీ పెంచుతుందని కంపెనీ భావిస్తోంది. ఇదే తరహాలో దేశంలోని ఇతర టెక్ కంపెనీలు సైతం తమ వర్క్ ఫోర్స్ ను ఇలాగే అభినందించాలని టెక్కీలు కోరుతున్నారు. ఇలాంటి కంపెనీల్లో పనిచేయాలని తాము కోరుకుంటున్నామని మరికొందరు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications