Agnikul: చెన్నై ఏరోస్పేస్ స్టార్టప్ సంచలనం.. అంతరిక్ష రంగంలో వండర్స్ సృష్టించేందుకు రెడీ!
Agnikul: చంద్రయాన్, ఆదిత్య వంటి అంతరిక్ష ప్రయోగాలతో ఇండియా మంచి జోష్ మీద ఉంది. భారత్ సాధించిన ఈ విజయాలు.. ప్రైవేట్ రంగంలోని పలు కంపెనీలకు స్ఫూర్తిగా నిలిచాయి. అంతరిక్ష రంగంలో తమదైన ముద్ర వేసేందుకు ఆయా సంస్థలు ముందడుగు వేస్తున్నాయి. చెన్నైకి చెందిన ఓ కంపెనీ ప్లానింగ్స్.. భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవనున్నాయి.
అగ్నికుల్' అనే చెన్నై బేస్డ్ స్టార్టప్ త్రీడీ ప్రింటెడ్ స్పేస్ క్రాఫ్ట్ ను అంతరిక్షంలోనికి పంపించేందుకు సిద్ధమవుతోంది. మరి కొద్దిరోజుల్లో దిగువ కక్షలోకి ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇండియాలోని ఏరోస్పేస్ స్టార్టప్ లపై ప్రపంచం దృష్టి పెట్టడంతో.. మొత్తం 40 మిలియన్ డాలర్ల మూలధనాన్ని కంపెనీ సేకరించింది.

వంద కిలోల బరువున్న పేలోడ్ ని లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి మోసుకెళ్లగలిగే సాటిలైట్ లాంచ్ వెహికల్ 'అగ్నిబాణ్'ను రూపొందించడం కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రైవేట్ రంగంలోని అంతరిక్ష విభాగంలో ఇదొక కీలక మైలురాయిగా నిలవనుంది. ఈ అగ్నిబాణ్ రాకెట్ లో అత్యాధునిక సెమీ క్రయోజనిక్ అగ్నిలెట్ ఇంజిన్ అమర్చనున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది ఆగస్టులో అగ్నికుల్ తన రాకెట్ అగ్నిబాణ్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ను మొదలుపెట్టింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం వద్దనున్న తమ కంపెనీ ఫెసిలిటీ సెంటర్ లో ఇందుకు సంబంధించిన కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నాయి. భారతదేశపు తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని ఈ కంపెనీ ఏర్పాటు చేసింది. ఇస్రో చైర్మన్ సోమనాథ్ గత నెల 28న అధికారికంగా దీన్ని ప్రారంభించారు.


Click it and Unblock the Notifications