Bonus Shares: ఇన్వెస్టర్లకు 15 షేర్లు ఫ్రీ.. భారీగా పెరిగిన మల్టీబ్యాగర్ స్టాక్..
Bonus Shares: చిన్న కంపెనీలు ఇన్వెస్టర్లకు భారీ బహుమతులను అందిస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ప్రకటించని స్థాయిలో బోనస్‌లతో పాటు క్యాపిటల్ గెయిన్స్ అందిస్తూ తమ తఢాకా చూపిస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రసాయన పరిశ్రమతో అనుబంధం ఉన్న చిన్న కంపెనీ యుగ్ డెకర్ లిమిటెడ్ భారీ బహుమతి గురించి. మల్టీబ్యాగర్ రాబడులను అందిస్తున్న కంపెనీ కాసుల వర్షంతో పాటు పెట్టుబడిదారులకు ఉచితంగా బోనస్ షేర్లను ప్రకటించింది. 15:100 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇస్తోంది. అంటే 100 షేర్లను కలిగి ఉన్న ఇన్వెస్టర్లకు అదనంగా 15 షేర్లను బోనస్ రూపంలో ఇవ్వబోతోంది. వార్తల నేపథ్యంలో స్టాక్ ధర సోమవారం బీఎస్ఈలో రూ.96 వద్ద ముగిసింది.

సెప్టెంబర్ 18న నిర్వహించిన బోర్డు సమావేశంలో కంపెనీ బోనస్ షేర్లను అందించేందుకు రికార్డు తేదీని అక్టోబర్ 5, 2023గా నిర్ణయించింది. స్పెషాలిటీ కెమికల్ వ్యాపారంలో ఉన్న యుగ్ డెకోర్ కంపెనీ ఇంతకు దీనికి ముందు గత ఏడాది అక్టోబరులో 1:2 నిష్పత్తిలో బోనస్ షేర్లను తన పెట్టుబడిదారులకు అందించింది. అంటే ప్రతి రెండు షేర్లు కలిగి ఉన్న పెట్టుబడిదారుడు ఒక షేరును ఉచితంగా పొందారు. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.60 కోట్లుగా ఉంది.
ఈ కంపెనీ షేర్లు రెండేళ్ల కంటే తక్కువ కాలంలోనే ఇన్వెస్టర్లకు 543 శాతం రాబడిని అందించాయి. ఈ క్రమంలో నవంబర్ 18, 2021న బీఎస్ఈలో స్టాక్ ధర రూ.14.93 వద్ద ఉంది. ప్రస్తుతం మార్కెట్లో స్టాక్ ధర రూ.96గా ఉంది. గడచిన ఆరు నెలల కాలాన్ని పరిశీలిస్తే స్టాక్ 68 శాతం రాబడిని అందించింది. 52 వారాల గరిష్ఠ ధర రూ.119.90 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.46.70గా ఉంది.


Click it and Unblock the Notifications