Multibagger Stock: మ్యాజిక్ రిటర్న్స్.. లక్ష పెట్టుబడిని రూ.65 లక్షలు చేసిన కెమికల్ స్టాక్స్..
Multibagger Stock: కరోనా తర్వాత దేశంలో అనేక కెమికల్ స్టాక్స్ మంచి పనితీరును కనబరిచాయి. తక్కువ మెుత్తంలో ఇన్వెస్ట్ చేసినప్పటికీ ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులను ఇవి అందించాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది గత దశాబ్దం కాలంలో స్టాక్ మార్కెట్‌ను శాసించిన కంపెనీల్లో ఒకటిగా నిలిచిన దీపక్ నైట్రేట్ స్టాక్ గురించే. దీర్ఘకాలంలో అంటే గత 10 ఏళ్లలో కంపెనీ షేర్ల ధరలు 6500 శాతం మేర లాభపడ్డాయి. ఈ కాలంలో 10 ఏళ్ల కిందట కంపెనీ షేర్లలో రూ.లక్ష పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.65 లక్షల రాబడిని ఇప్పుడు పొందుతున్నారు. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయంలో కంపెనీ షేర్ ధర రూ.2,083గా ఉంది.

గడచిన ఐదేళ్ల కాలంలో దీపక్ నైట్రైట్ స్టాక్ షేర్లు 623 శాతం మేర లాభపడ్డాయి. అదే సమయంలో 3 ఏళ్ల క్రితం ఈ స్టాక్‌ను కొనుగోలు చేసి హోల్డ్ చేసిన ఇన్వెస్టర్లు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 374 శాతం రాబడిని పొందేవారు. కెమికల్స్ వ్యాపారంలో కంపెనీ వేగంగా వృద్ధి చెందుతున్నందున స్టాక్ మంచి పనితీరును కనబరుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం కంపెనీలో మ్యూచువల్ ఫండ్ కంపెనీలు 8.58 శాతం, విదేశీ ఇన్వెస్టర్లు 6.27 శాతం, ప్రభుత్వ బీమా సంస్థ ఎల్ఐసీ 8.12 శాతం హోల్డ్ చేస్తున్నాయి.
కంపెనీ ఆర్థిక పనితీరును గమనిస్తే.. జూన్ త్రైమాసికంలో ఆదాయం రూ.1,800 కోట్లుగా ఉంది. ఇది వార్షిక ప్రాతిపదికన 13 శాతం తక్కువ. అలాగే గత 6 నెలల కాలలో దీపక్ నైట్రేట్ షేర్లు 12 శాతం కంటే ఎక్కువ లాభపడ్డాయి. స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.1,730 వద్ద ఉండగా.. 52 వారాల గరిష్ఠ షేర్ ధర రూ.2,372.70గా ఉంది.


Click it and Unblock the Notifications