Multibagger Stock: రూపాయిలు వేలుగా మార్చటం అంత సులువు కాదు. అయితే ఈ పవర్ కొన్ని పెన్నీ స్టాక్స్ కి కూడా ఉంటుంది. వాటిని గుర్తించటం కూడా అంత కష్టం కాదు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది మాత్రం ఒక మంచి కెమికల్ స్టాక్ గురించి. కరోనా సమయం ముందు నుంచి ఈ స్టాక్ మంచి మెుమెంటం కలిగి ఉంది. దీని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది దీపక్ నైట్రేట్ లిమిటెడ్ షేర్ గురించే. దీర్ఘకాలం పాటు పెట్టుబడులను కొనసాగించిన వారికి ఈ స్టాక్ 11,225.66% రాబడిని అందించింది. దాదాపు 22 ఏళ్లలో ఈ స్టాక్ రూ.17.81 నుంచి రూ.2,017.10కి పెరిగింది. ముఖ్యంగా కరోనా ప్రారంభ సమయం నుంచి స్టాక్ వేగంగా ఎదిగింది. ఈ కాలంలో ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందించి వారికి లాభాల పంట పండించింది.

నిపుణుల అభిప్రాయం ఇలా..
మార్కెట్ నిపుణులు ఇప్పటికీ ఈ స్టాక్‌పై బుల్లిష్‌గా ఉన్నారు. వారి అంచనాల ప్రకారం షేర్ ధర రానున్న కాలంలో మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ Edelweiss అంచనాల ప్రకారం రానున్న కాలంలో రూ.3,127 వరకు చేరుకోవచ్చని తెలిపింది. ఈ లెక్కన స్టాక్ ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి దాదాపు 50 శాతం వరకు పెరగవచ్చు.

ఇటీవల కంపెనీలో అగ్ని ప్రమాదం..
గుజరాత్ నందేసరిలో ఉన్న కంపెనీ ప్లాంట్‌లో ఇటీవల అగ్నిప్రమాదం సంభవించింది. దీని వల్ల చాలా నష్టం వాటిల్లింది. కానీ ఇప్పుడు కంపెనీ రికవరీ అయింది. ప్లాంట్‌ను మరోసారి పునఃప్రారంభించింది. తాజాగా.. జూన్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలను కూడా కంపెనీ విడుదల చేసింది. ఇందులో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 36% పెరిగినప్పటికీ.. లాభాలు మాత్రం 22 శాతం తగ్గాయి. FY-2023 కోసం కంపెనీ తన విస్తరణ ప్రణాళికలో భాగంగా సుమారు రూ.15 బిలియన్లను ఖర్చు చేయాలని యోచిస్తోంది. ఈ నిర్ణయం కారణంగా రానున్న రోజుల్లో షేర్ పాజిటివ్ గా ప్రభావితమై పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

పెట్టుబడిపై రాబడి..
దీపక్ నైట్రైట్ స్టాక్ ఈ రోజు రూ.31 లాభపడి రూ.2,053 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ స్టాక్ లో రూ.17.81 వద్ద లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు ఈ రోజు మార్కెట్ రేటు ప్రకారం రూ.1.15 కోట్లుగా ఉండేది. అయితే ప్రస్తుతం అంచనాల ప్రకారం స్టాక్ లో లక్ష పెట్టుబడి పెడితే అది రెండితలుగా మారవచ్చని బ్రోకరేజ్ సంస్థ అంచనాలు చెబుతున్నాయి. అయితే పెట్టుబడి పెట్టాలనుకునే ఇన్వెస్టర్లు ఈ స్టాక్ పై ఓ కన్నేసి ఉంచవచ్చు.
మా సూచన ఏమిటంటే.. ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవలనుకున్నా దానికి ముందు మీ ఆర్థిక నిపుణులను సంప్రదించటం సరైన నిర్ణయం.


Click it and Unblock the Notifications