Multibagger Share: కోటీశ్వరులైన ఇన్వెస్టర్లు.. లక్ష పెట్టుబడిని రూ.9 కోట్లు చేసిన సూపర్ షేర్..
Penny Stock: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం చాలా సులభమే. కానీ.. దానికి సరైన నిర్ణయాలు కూడా చాలా అవరసం. అప్పుడే ఇన్వెస్టర్లు అనుకున్న లాభాలు పొందగలుగుతారు. ఇందుకోసం కొంచెం రీసెర్చ్ అవసరం అవుతుంది. వందలు వేల సంఖ్యలో ఉన్న అనేక షేర్ల నుంచి మంచి రాబడిని ఇస్తూ.. గ్రోత్ కు అవకాశం ఉన్న మల్టీబ్యాగర్ స్టాక్స్ ను వెతకటానికి కొంత శ్రమించటం అవసరం. కొన్ని పెన్నీ స్టాక్స్ ఇన్వెస్టర్లకు ఊహించని లాభాలను ఇచ్చి వారిని అమాతం కోటీశ్వరులను కూడా చేసేస్తుంటాయి. రిటర్న్‌లు ఇవ్వడంలో అన్ని రికార్డులను బద్దలు కొట్టిన స్టాక్ గురించి ఈ రోజు మనం మీకు చెప్పబోతున్నాం. అచ్చం అలాంటి స్టాకే కెమికల్స్ వ్యాపారంలో ఉన్న దీపక్ నైట్రేట్.

5 ఏళ్లలో ఆశ్చర్యపరిచిన స్టాక్..
కెమికల్స్ వ్యాపారంలో ఉన్న దీపక్ నైట్రేట్ స్టాక్ 85,000 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చి ఆశ్చర్యపరిచింది. ఈ షేర్ రూ. 2 నుంచి దాదాపు రూ.1,800 స్థాయికి పెరిగింది. షేర్ బుధవారం (జూన్ 10) రూ.1,854.70 వద్ద స్టాక్ మార్కెట్లో ముగిసింది. గత 5 సంవత్సరాల్లో.. ఈ స్టాక్ తన ఇన్వెస్టర్లకు దాదాపు 1200 శాతం రాబడిని అందించింది. దీపక్ నైట్రేట్ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.3,020గా ఉంది.

లక్ష.. రూ. 9 కోట్లు ఎలా అయింది?
2001 ఆగస్టు 10న ఎవరైనా దీపక్ నైట్రేట్ షేర్‌లో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే.. ఆ సమయంలో అతనికి 51 వేల షేర్లు వచ్చేవి. అప్పట్లో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి ఇప్పటి వరకు వాటిని ఉంటున్నట్లయితే.. రూ.1,854 ధర ప్రకారం దాని విలువ దాదాపు 9 కోట్లకు పైగా ఉంది. షేరు 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.1712.50గా ఉంది. ఈ స్టాక్ రానున్న కాలంలో కూడా మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ స్టాక్ లో పెట్టుబడి అవకాశం కోసం ఇన్వెస్టర్లు చూడవచ్చు.

85 వేల శాతం కంటే రిటర్న్స్..
ఆగస్ట్ 10, 2001న BSEలో దీపక్ నైట్రేట్ షేర్ ధర రూ. 1.96గా ఉంది. అది జూన్ 10, 2022న ముగిసిన ట్రేడింగ్ సెషన్‌లో స్టాక్ రూ.1,854.70 వద్ద ముగిసింది. కంపెనీ స్టాక్ 2001 నుంచి ఇప్పటి వరకు 85,000 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది.


Click it and Unblock the Notifications