Multibagger Stock: లక్ష పెట్టుబడిని రూ.12 కోట్లు చేసిన మల్టీబ్యాగర్.. బోనస్ షేర్లు కూడా..
Multibagger Stock: స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన చాలా కంపెనీలు తమ ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్, మధ్యంతర డివిడెండ్ వంటివి అందిస్తుంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు బలమైన లాభాలను అందిస్తాయి. అలాంటి కోవకు చెందినదే జ్యోతి రెసిన్స్ అండ్ అడెసివ్స్ లిమిటెడ్ స్టాక్. ఈ స్మాల్ క్యాప్ కెమికల్ స్టాక్ ఇటీవల 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేసింది. అంటే ఒక్కో షేరుకు రెండు బోనస్ షేర్లను అందించింది.

స్టాక్ చరిత్ర..
ఏడాది కాలంలో భారతీయ స్టాక్ మార్కెట్ సృష్టించిన మల్టీబ్యాగర్ స్టాక్‌లలో జ్యోతి రెసిన్ షేర్ కూడా ఒకటి. ఈ స్మాల్-క్యాప్ కెమికల్ స్టాక్ ధర ఈ కాలంలో రూ.535 స్థాయి నుంచి రూ.1281 స్థాయికి పెరిగింది. దీంతో పెట్టుబడిదారులు 140 శాతం రాబడిని పొందారు. గడచిన ఐదేళ్ల కాలాన్ని గమనిస్తే స్టాక్ ధర రూ.22.55 నుంచి రూ.1281 స్థాయికి చేరుకుంది. అంటే ఈ కాలంలో ఏకంగా 5600 శాతం రాబడిని అందించింది. అలాగే దశాబ్దకాలాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే స్టాక్ ధర రూ.3.25 స్థాయి నుంచి రూ.1281 స్థాయికి పెరిగింది. అంటే దీర్ఘకాలం పెట్టుబడిని కొనసాగించిన వారికి స్టాక్ 39,300 శాతం రాబడిని అందించింది.

జ్యోతి రెసిన్ బోనస్..
BSE అధికారిక వెబ్‌సైట్ సమాచారం ప్రకారం కెమికల్ మల్టీబ్యాగర్ స్టాక్ సెప్టెంబర్ 8, 2022న 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేసింది. 10 ఏళ్ల కిందట ఎవరైనా ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే వారికి రూ.3.25 చొప్పున 30,769 షేర్లు ఉండేవి. దానిపై కంపెనీ ఇచ్చిన బోనస్ కలుపుకుంటే మెుత్తం షేర్ల సంఖ్య 92,307కి చేరుకుంటుంది.

లక్షను రూ.12 కోట్లుగా మార్చి..
ఎవరైనా ఇన్వెస్టర్ దశాబ్దం కిందట కంపెనీ షేర్లలో లక్ష పెట్టుబడి పెట్టి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే వారు ఖచ్చితంగా కోటీశ్వరులనే చెప్పుకోవాలి. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి స్టాక్ ధర రూ.1281.50 వద్ద ఉంది. దీని ప్రకారం లక్ష పెట్టుబడిని దీర్ఘకాలం కొనసాగించి ఉంటే ఇన్వెస్టర్లు ప్రస్తుత ధర ప్రకారం రూ.11.82 కోట్లను పొందుతారు.


Click it and Unblock the Notifications