వ్యవసాయ రసాయనాల సంస్థ NACL ఇండస్ట్రీస్ షేర్లు రోజురోజుకి మంచి పెరుగుదలను చూస్తున్నాయి. ఇవాళ బుధవారం ఒక్కరోజే కంపెనీ షేర్లు 5 శాతం పెరిగి రూ.156.55కి చేరుకున్నాయి. దింతో నేడు NACL ఇండస్ట్రీస్ షేర్లు కూడా 52 వారాల సరికొత్త గరిష్ట స్థాయిని తాకాయి. గత నెల అంటే మార్చ్ నెలలో కంపెనీ షేర్లు 133 శాతానికి పైగా ఎగిశాయి. ఈ కాలంలో NACL ఇండస్ట్రీస్ షేర్లు రూ.67 నుండి రూ.155కి పెరిగింది. నిన్న ఉదయం 11:03 గంటల వరకు చూస్తే మొత్తం 258,000 షేర్లు చేతులు మారాయి అలాగే NSE అండ్ BSEలో దాదాపు 1.5 మిలియన్ షేర్లకు కొనుగోలు ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పురుగుమందులు, వ్యవసాయ రసాయనాల తయారు చేసే కంపెనీ స్టాక్ వరుసగా ఆరో ట్రేడింగ్ రోజు కూడా అప్పర్ సర్క్యూట్‌లో నిలిచింది. ఈ కాలంలో షేర్స్ 52 శాతం ర్యాలీ చేసింది. గత ఒక నెలలో BSE సెన్సెక్స్‌లో 1 శాతం క్షీణతతో పోలిస్తే 112 శాతం పెరిగింది.

53% వాటా కొనుగోలు చేయనున్న కోరమండల్ ఇంటర్నేషనల్: 12 మార్చి 2025న మురుగప్ప గ్రూప్ కంపెనీ కోరమండల్ ఇంటర్నేషనల్ వ్యవసాయ రసాయన సంస్థ NACL ఇండస్ట్రీస్ (గతంలో దీని పేరు నాగార్జున అగ్రికెమ్)లో 53 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే NACL ఇండస్ట్రీస్‌లో వాటాను కొనుగోలు చేయడానికి కోరమాండల్ ఇంటర్నేషనల్ ఇప్పటికే ఒప్పందంపై సంతకం చేసింది. కోరమాండల్ ఇంటర్నేషనల్ ఈ వాటాను ఒక్కో షేరుకు రూ. 76.70 చొప్పున మొత్తం వాటాను కంపెనీ రూ.820 కోట్లకు సొంతం చేసుకోనుంది. కోరమాండల్ ఇంటర్నేషనల్ ఈ షేర్లను కంపెనీ ప్రస్తుత ప్రమోటర్ అయిన KLR ప్రొడక్ట్స్ లిమిటెడ్ నుండి కొనుగోలు చేస్తుంది. NACL అనేది భారతదేశానికి చెందిన పంట రక్షణ సంస్థ, అలాగే మన దేశంలో బలమైన బ్రాండెడ్ ఫార్ములేషన్ వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. ఇంకా మల్టీనేషనల్ వ్యవసాయ రసాయన కంపెనీలతో కాంట్రాక్ట్ తయారీ నిర్వహిస్తుంది.
గత ఐదు సంవత్సరాలలో 566% పెరిగిన కంపెనీ షేర్లు : గత ఐదు సంవత్సరాలలో చూస్తే NACL ఇండస్ట్రీస్ షేర్లు భారీ పెరుగుదలను నమోదు చేశాయి. ఈ స్మాల్‌క్యాప్ కంపెనీ షేర్లు ఐదేళ్లలో 566 శాతానికి పైగా పెరిగాయి. 2020 ఏప్రిల్ 9న NACL ఇండస్ట్రీస్ షేర్లు రూ. 23.50 వద్ద ఉండగా, 2025 ఏప్రిల్ 9న కంపెనీ షేర్లు రూ. 156.55కి చేరుకున్నాయి. అంటే గత కొన్నేళ్లలో NACL ఇండస్ట్రీస్ షేర్లు 81 శాతానికి పైగా పెరిగాయి. అదే సమయంలో గత ఏడాది కాలంలో కంపెనీ షేర్లు 148 శాతం పెరిగాయి. ఈ కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ట స్థాయి రూ.156.55. అంతేకాక కంపెనీ షేర్ల 52 వారాల కనిష్ట స్థాయి రూ.48.60.


Click it and Unblock the Notifications