FirstCry, Unicommerce eSolutions IPO: ఐపీఓ అలాట్ మెంట్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..
'ఫస్ట్‌క్రై' బ్రాండ్ మాతృ సంస్థ బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) కోసం బిడ్డింగ్ ముగిసింది. పెట్టుబడిదారులు షేర్ కేటాయింపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'T+3' లిస్టింగ్ నియమం ప్రకారం ఫస్ట్ క్రై ఐపీఓ లిస్టింగ్ తేదీ ఆగస్టు 13, 2024గా ఉండవచ్చు. కేటాయింపు ఆలస్యం అయినట్లయితే, ఫస్ట్‌క్రి ఐపీఓ కేటాయింపు స్థితి 12 ఆగస్టు 2024న అందుబాటులోకి రావచ్చు.
ఫస్ట్‌క్రై ఐపీఓ కేటాయింపు స్థితి తెలుసుకోవాలంటే BSE వెబ్‌సైట్ లేదా అధికారిక రిజిస్ట్రార్‌లో లాగిన్ అయి తెలుసుకోవచ్చు. లింక్ ఇన్‌టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వెబ్‌సైట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. కాగా శనివారం ఫస్ట్ క్రై గ్రే మార్కెట్ రూ.64, ఇది శుక్రవారం నాటి GMPకి కంటే రూ.6 ఎక్కువ. కేటాయింపు స్థితిని ప్రకటించిన తర్వాత, BSE వెబ్‌సైట్ bseindia.com లేదా లింక్ ఇన్‌టైమ్ వెబ్‌సైట్ linkintime.co.inలో లాగిన్ చేయడం ద్వారా కేటాయింపు స్థితిని తెలుసుకోవచ్చు.

bseindia.com/investors/appli_check.aspx పై క్లిక్ చేసి పాన్ నంబర్ లేదా ఐపీఓ అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేస్తే మీ కేటాయింపు స్థితి తెలుస్తోంది. లేదా linkintime.co.in/initial_offer/public-issues.html లో కూడా కేటాయింపు స్థితి తెలుసుకోవచ్చు. మరో ఐపీఓ
యూనికామర్స్ ఇసొల్యూషన్స్ లిమిటెడ్ షేర్లు కేటాయింపు చేసింది. పబ్లిక్ ఇష్యూ కోసం దరఖాస్తు చేసుకున్న వారు BSE వెబ్‌సైట్ లేదా అధికారిక రిజిస్ట్రార్ వెబ్‌సైట్‌లో లాగిన్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో IPO కేటాయింపు స్థితిని తనిఖీ చేయవచ్చు.
యూనికామర్స్ ఇసొల్యూషన్స్ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం శనివారం రూ. 55 గా ఉంది. ఇది శుక్రవారం నాటి కంటే రూ.5 ఎక్కువ. శుక్రవారం గ్రే మార్కెట్ ప్రీమియం రూ.50గా ఉంది. యూనికామర్స్ ఇసొల్యూషన్స్ షేర్లు ఆగస్ట్ 13న స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications