పదవీ విరమణకు సంబంధించి పెద్ద మొత్తంలో కూడబెట్టుకోవడం కోసం మీకు సహకరించే మంచి ఉత్పత్తుల్లో నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) ఒకటి. ఇది మార్కెట్ లింక్డ్, డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ ప్రోడక్ట్. ఇందుకు మీరు ఎంచుకున్న ఫండ్స్‌లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి. మీరు ఎంచుకున్న ఫండ్స్ పర్ఫార్మెన్స్ ఆధారంగా మీ రిటర్న్స్ ఉంటాయి. మీరు ఎంచుకోవడానికి ఎనిమిది పెన్షన్ ఫండ్ మేనేజర్లు ఉన్నాయి. రిటర్న్స్‌ను ట్రాక్ చేయడం ద్వారా మీరు పని తీరును చూడవచ్చు. ఎన్పీఎస్ యొక్క వివిధ ఫండ్స్ పనితీరును ఇక్కడ చూడండి... ఈక్విటీ ఫండ్స్, ప్రభుత్వ బాండ్ ఫండ్స్, కార్పోరేట్ బాండ్ ఫండ్స్.
కాగా, పెన్షన్ రెగ్యులేటర్ PFRDA నేషనల్ పెన్షన్ స్కీమ్(NPS) పథకంలో చేరిన సబ్‌స్క్రైబర్లకు ఒక ఆర్థిక సంవత్సరంలో నాలుగుసార్లు తమ పెట్టుబడి విధానాన్ని మార్చుకోవడానికి త్వరలో అవకాశం కల్పించనుంది. ఈ మేరకు PFRDA చైర్మన్ సుప్రతిమ్ బందోపాధ్యాయ ఇటీవల తెలిపారు. పరిశ్రమ సమాఖ్య అసోచామ్ ఎన్పీఎస్ పథకంపై నిర్వహించిన వెబినార్‌లో ఇటీవల ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం ఎన్పీఎస్ సబ్‌స్క్రైబర్లు తమ పెట్టుబడి విధానాన్ని ఒక ఆర్థిక సంవత్సరంలో రెండుసార్లు మార్చుకునే వెసులుబాటు ఉంది. దీనిని నాలుగుకు పెంచనున్నారు.

సబ్‌స్క్రైబర్లు తమ పెట్టుబడి విధానాన్ని ఒక ఆర్థిక సంవత్సరంలో రెండుసార్లు మాత్రమే మార్చుకునేందుకు వీలుందని, స్వల్ప వ్యవధిలో దీనిని నాలుగు సార్లకు పెంచబోతున్నామని, పెట్టుబడి విధానాన్ని మార్చేందుకు అవకాశాలు పెంచాలని ఇటీవల అభ్యర్థనలు బాగా వస్తున్నాయని, దీంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రభుత్వ సెక్యూరిటీస్, డెట్ సాధనాలు, అసెట్-బ్యాక్డ్, ట్రస్ట్-స్ట్రక్చర్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్, స్వల్ప కాలిక రుణ సాధనాలు, ఈక్విటీల్లో తమ పెట్టుబడుల కేటాయింపును మార్చుకొనేందుకు వీలుంటుంది.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications