మొబైల్ రీఛార్జ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో.. ప్రతినెలా రీఛార్జ్ చేయాలంటే సామాన్యుల జేబుకు చిల్లు పడడం ఖాయం. అందుకే చాలా మంది ఇప్పుడు వార్షిక ప్లాన్ల (Annual Plans) వైపు మొగ్గు చూపుతున్నారు. నెలకు రూ.300 లేదా రూ. 400 కట్టడం కంటే ఏడాదికి ఒకేసారి రీఛార్జ్ చేయడం వల్ల గణనీయమైన మొత్తాన్ని ఆదా చేయవచ్చు. మరి 2026లో ప్రముఖ టెలికాం సంస్థలైన జియో (Jio), ఎయిర్‌టెల్ (Airtel), వి (Vi) అందిస్తున్న అత్యంత చౌకైన రీఛార్జ్ ప్లాన్ (Recharge plan) ఏది? వీటిలో ఏది మీకు లాభసాటి? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

జియో (Jio): డేటా ప్రియులకు పండగే!
జియో తన వినియోగదారుల కోసం రూ.3,599 ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇది పైకి భారీ మొత్తంగా అనిపించినా, నెలవారీ లెక్కన చూస్తే కేవలం రూ. 300 మాత్రమే పడుతుంది.
- ప్రయోజనాలు: రోజుకు 2.5GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు.
- స్పెషల్: మీరు 5G నెట్‌వర్క్ ఉన్న ప్రాంతంలో ఉంటే, అన్‌లిమిటెడ్ 5G డేటాను ఎంజాయ్ చేయవచ్చు.
- ఎవరికి బెస్ట్: ప్రతినెలా డేటా అయిపోతుందని భయపడే వారికి, వీడియోలు ఎక్కువగా చూసే వారికి ఈ రీఛార్జ్ ప్లాన్ (Recharge plan) పర్ఫెక్ట్ ఛాయిస్.
ఎయిర్‌టెల్ (Airtel): సిమ్ యాక్టివ్‌గా ఉండాలంటే ఇదే బెస్ట్!
మీరు మొబైల్ డేటా కంటే కాల్స్ ఎక్కువగా మాట్లాడతారా? లేదా వైఫై వాడుతూ కేవలం ఫోన్ నంబర్ యాక్టివ్ గా ఉండాలని కోరుకుంటారా? అయితే ఎయిర్‌టెల్ రూ.1,849 ప్లాన్ మీ కోసమే.
- ప్రయోజనాలు: ఏడాది పొడవునా అన్‌లిమిటెడ్ కాల్స్, మొత్తం సంవత్సరానికి 3,600 ఎస్సెమ్మెస్‌లు.
- నెలకు ఖర్చు: నెలకు కేవలం రూ. 154 మాత్రమే.
- డేటా ఉండదు: అయితే ఇందులో డైలీ డేటా ఉండదు. కేవలం కాల్స్, ఓటిపి (OTP)ల కోసం ఫోన్ వాడే వారికి, ముఖ్యంగా తల్లిదండ్రులకు లేదా సెకండరీ సిమ్ వాడే వారికి ఇది చాలా పొదుపైన ప్లాన్.
వోడాఫోన్ ఐడియా (Vi): అతి తక్కువ ధరలో డేటా ప్యాక్!
అందరికంటే తక్కువ ధరకే ఎంట్రీ లెవల్ వార్షిక ప్లాన్‌ను అందిస్తోంది వి (Vi). రూ.1,189 ప్లాన్ తో ఏడాది పొడవునా డేటా పొందొచ్చు.
- ప్రయోజనాలు: ఇది డేటా-ఓన్లీ ప్యాక్. అంటే ఏడాది మొత్తానికి 50GB డేటా వస్తుంది. దీని నెలవారీ ఖర్చు రూ. 100 లోపే ఉంటుంది.
- కాలింగ్ ప్లాన్: మీరు కాలింగ్ ప్లాన్ కావాలనుకుంటే, ఎయిర్‌టెల్ లాగానే రూ.1,849 ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఇది కూడా నెలకు రూ. 154 ఖర్చుతో అన్‌లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది.
- ఎవరికి బెస్ట్: విద్యార్థులకు లేదా బ్యాకప్ సిమ్ కార్డులు వాడే వారికి ఈ తక్కువ ధర ప్లాన్లు బాగా ఉపయోగపడతాయి.
వార్షిక ప్లాన్ వల్ల లాభమేంటి?
ప్రతినెలా రీఛార్జ్ గడువు ఎప్పుడు ముగుస్తుందో అని ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు. 2026 నాటి ధరల ప్రకారం.. మీరు విడివిడిగా 12 నెలలు రీఛార్జ్ చేస్తే అయ్యే ఖర్చు కంటే, ఈ వార్షిక ప్లాన్లపై కనీసం రూ.500 నుండి రూ.800 వరకు ఆదా చేయవచ్చు. పైగా ధరలు పెరిగే అవకాశం ఉన్నా.. మీరు ఒకసారి రీఛార్జ్ చేస్తే ఏడాది వరకు ఆ టెన్షన్ ఉండదు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications