ChatGPT: సీఈవోను తొలగించిన OpenAI.. వెంటనే రాజీనామా చేసిన ప్రెసిడెంట్ గ్రిగ్ బ్రోక్మెన్..
ChatGPT: ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో చాట్ జీపీటీ పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇది ప్రపంచ దిగ్గజాలైన గూగుల్-మైక్రోసాఫ్ట్ మధ్య పెద్ద పోటీకి తెరదీసింది.
తాజాగా కంపెనీలో జరుగుతున్న పరిణామాలు వ్యాపార రంగంలోనే పెద్ద షాకింగ్ వార్తగా నిలిచింది. వాస్తవానికి ఓపెన్ ఏఐ సంస్థ చాట్ జీపీటీని నిర్మించింది. ఈ కంపెనీకి సామ్ ఆల్ట్‌మన్ సీఈవోగా ఉండేవారు. అయితే అతని పనితీరుతో తృప్తి చెందని కంపెనీ బోర్టు శామ్ ను బోర్డు నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆయన స్థానంలో తాత్కాలికంగా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మిరా మురాఠీ బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రకటనతో కంపెనీ సహ-వ్యవస్థాపకుడు గ్రిగ్ బ్రోక్మెన్ కంపెనీని వీడుతున్నట్లు కొన్ని గంటల్లో ప్రకటించటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఫుల్ టైమ్ సీఈవో కోసం కంపెనీ అధికారిక శోధనను నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది. యాప్‌ను విడుదల చేయాలనే ఆల్ట్‌మాన్ గత సంవత్సరం తీసుకున్న నిర్ణయం అతను ఊహించని విధంగా ఫలించింది. నిష్క్రమణపై స్పందిస్తూ.. ఓపెన్ ఏఐలో తాను గడపిన సమయాన్ని ప్రేమిస్తున్నట్లు మాజీ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ పేర్కొన్నారు. ఆ సమయంలో ప్రతిభావంతులైన వ్యక్తులతో కలిసి పనిచేయటం ఇష్టపడ్డానని పేర్కొన్నారు. అయితే రానున్న కాలంలో ఆయన ప్రత్యర్థి కంపెనీల్లో చేరతారా అనే విషయం తెలియాల్సి ఉంది.
ఇదే క్రమంలో నిష్క్రమించిన సహవ్యవస్థాపకుడు గ్రిగ్ కంపెనీ ప్రారంభం గురించి గుర్తుచేసుకున్నారు. 8 ఏళ్ల కిందట తన అపార్ట్‌మెంట్‌లో కంపెనీని ప్రారంభించినప్పటి నుంచి కలిసి నిర్మించటంపై తాను చాలా గర్వపడుతున్నానని చెప్పారు. బృందంగా కష్టమైన & గొప్ప సమయాలను ఎదుర్కొన్నామని గుర్తుచేసుకున్నారు.


Click it and Unblock the Notifications