ఇక మీ ఖర్చులు, పొదుపు లెక్కలన్నీ అదే చూసుకుంటుంది! ChatGPT లో క్రేజీ ఫీచర్!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న ఓపెన్ఏఐ (OpenAI), తమ యూజర్ల కోసం ఒక అదిరిపోయే అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు మీ రోజువారీ ఖర్చులు, పొదుపు, ఇన్వెస్ట్‌మెంట్‌లను ట్రాక్ చేయడానికి వేరే ఏ ఫైనాన్స్ యాప్స్ వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఛాట్ జీపీటీ (ChatGPT) లోపలే సరికొత్తగా 'పర్సనల్ ఫైనాన్స్' (Personal Finance) ఫీచర్‌ను లాంచ్ చేశారు.

ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు తమ బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డులు, ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్లను నేరుగా ఈ AI చాట్‌బాట్‌కు లింక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ అమెరికాలోని ప్రొ (ChatGPT Pro) యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ప్లస్ (Plus) యూజర్లకు కూడా రోల్ అవుట్ చేయనున్నారు.

ChatGPT launches personal finance feature to track spending and investments link bank accounts

ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? ఏమేం చేయొచ్చు?

సాధారణ ఫైనాన్స్ యాప్స్ లాగా కేవలం నంబర్లు, గ్రాఫ్‌లు చూపించడమే కాకుండా.. ChatGPT మీతో మాట్లాడుతూ మీ ఆర్థిక పరిస్థితిని వివరిస్తుంది. అకౌంట్లను కనెక్ట్ చేసిన తర్వాత మీరు చాటింగ్‌లోనే సింపుల్‌గా ప్రశ్నలు అడగవచ్చు.

  • "ఈ మధ్య నా ఖర్చులు ఎందుకు పెరిగాయి?"
  • "నేను ఇంకా ఏయే సబ్‌స్క్రిప్షన్లకు అనవసరంగా డబ్బులు కడుతున్నాను?"
  • "భవిష్యత్తులో నేను సొంత ఇల్లు కొనగలనా? నా సేవింగ్స్ సరిపోతాయా?"

ఇలాంటి ప్రశ్నలన్నింటికీ మీ అకౌంట్ డేటాను బట్టి ChatGPT పక్కాగా సమాధానాలు ఇస్తుంది. ఈ డ్యాష్‌బోర్డ్ బ్యాక్‌ఎండ్‌లో 'GPT-5.5 Thinking' మోడల్ ద్వారా రన్ అవుతుంది. కాబట్టి చాలా కచ్చితమైన అంచనాలను ఇది అందిస్తుంది. అమెరికాలోని చేజ్, ఫిడిలిటీ, రాబిన్‌హుడ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి దాదాపు 12,000 పైగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలను 'ప్లాయిడ్' (Plaid) ఇంటిగ్రేషన్ ద్వారా దీనికి లింక్ చేసుకోవచ్చు.

దీన్ని ఎలా యాక్సెస్ చేయాలి?

యూజర్లు తమ చాట్‌బాట్ సైడ్‌బార్‌లో ఉండే "Finances" సెక్షన్‌ను ఓపెన్ చేసి దీన్ని వాడొచ్చు. లేదా నార్మల్ చాట్ విండోలోనే "@Finances, connect my accounts" అని టైప్ చేసి కూడా అకౌంట్లను కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం నెలకు 200 డాలర్లు చెల్లించే ప్రో సబ్‌స్క్రైబర్లకు మాత్రమే ఈ ఛాన్స్ ఉంది.

ప్రైవసీ, సెక్యూరిటీ ఎంతవరకు సేఫ్?

బ్యాంక్ అకౌంట్లు లింక్ చేయడం అంటే అందరికీ ప్రైవసీ భయాలు ఉండటం సహజం. అయితే ఓపెన్ఏఐ దీనిపై క్లారిటీ ఇచ్చింది. ChatGPT కేవలం మీ అకౌంట్ బ్యాలెన్స్, ట్రాన్సాక్షన్లు, ఇన్వెస్ట్‌మెంట్‌లను మాత్రమే చూడగలదు. కానీ, మీ అకౌంట్ నుండి డబ్బులను వేరే చోటికి ట్రాన్స్‌ఫర్ చేయడం గానీ, మీ పూర్తి అకౌంట్ నంబర్లను యాక్సెస్ చేయడం గానీ దీనివల్ల సాధ్యం కాదు. అలాగే యూజర్లు ఎప్పుడైనా తమ అకౌంట్లను డిస్‌కనెక్ట్ చేసుకోవచ్చు. అలా చేసిన 30 రోజుల్లోనే మీ ఫైనాన్షియల్ డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. అంతేకాకుండా, టెంపరరీ చాట్స్ (Temporary chats) కి ఈ డేటా యాక్సెస్ ఉండదు.

ఇటీవలే ఓపెన్ఏఐ సంస్థ 'హీరో' (Hiro) అనే పర్సనల్ ఫైనాన్స్ స్టార్టప్‌ను కొనుగోలు చేసింది. దీని తర్వాత 'ఇంటుఇట్' (Intuit) అనే ట్యాక్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీతో కూడా చేతులు కలపబోతోంది. దీనివల్ల ఫ్యూచర్‌లో ట్యాక్స్ అంచనాలు, స్టాక్ మార్కెట్ సేల్స్ లెక్కలు కూడా నేరుగా ChatGPT లోనే చూసుకునే వీలుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+