ఓపెన్ ఏఐకి చెందిన ChatGPT లో పలు సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు AI చాట్‌బాట్‌ను యాక్సెస్ చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొన్నట్లుగా తెలుస్తోంది. కాగా అత్యంత తీవ్రంగా ఇబ్బంది పడిన దేశాలలో భారత్ ఒకటిగా నిలిచింది. మానిటరింగ్ ప్లాట్‌ఫామ్ డౌన్‌డెటెక్టర్ లో వందలాది మంది బారతీయులు ఈ సమస్యపై ఫిర్యాదు చేశారు.
డౌన్‌డిటెక్టర్ (Downdetector) ప్రకారం చూసుకున్నట్లయితే.. బుధవారం మధ్యాహ్నం నుంచి ఈ సమస్య తలెత్తినట్లుగా తెలుస్తోంది. భారత్ నుంచే దాదాపు 500కిపైగా ఫిర్యాదులు నమోదు అయ్యాయి. మొబైల్ యాప్, వెబ్ రెండింటిలోనూ ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు చాలామంది యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. యూజర్లు ఏదైనా ప్రశ్న వేయగా దాన్ని స్వీకరించేందుకు చాట్ జీపీటీ నిరాకరిస్తోందని చెబుతున్నారు. ప్రశ్న తీసుకున్నా దానికి స్పందించడం లేదని యూజర్లు పేర్కొంటున్నారు.

కొందరు లాగిన్, నెట్‌వర్క్ ఎర్రర్, యాప్ సంబంధిత ఇతర సమస్యలు కూడా ఎదుర్కొంటున్నట్లు డౌన్‌డిటెక్టర్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. 'చాట్ జీపీటీ డౌన్' అంటూ యూజర్లు ఎక్స్‌లో పోస్టులతో హోరెత్తిస్తున్నారు. 2022 చివర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పని చేసే చాట్‌జీపీటీని ఓపెన్ ఏఐ అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి విదితమే. ఈ చాట్‌బోట్ సాయంతో యూజర్లు తమకు అవసరమైన ఖచ్చితమైన సమాచారాన్ని కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే పొందవచ్చు. ఎలాంటి క్లిష్ట ప్రశ్నకైన ఇది క్షణాలలోనే సమాధానం చెబుతుండటంతో చాలా మంది దీన్ని వాడేందుకు ఆసక్తి చూపుతున్నారు.
కాగా ఈ ఏడాదిలో చాలా సార్లు చాట్ జీపీటీ సేవలు నిలిచిపోయాయి. ఈ ఏడాది జూలైలో రెండు సార్లు అంతరాయాన్నిఎదుర్కుంది. ఇటీవల కాలంలో చాలా మంది ఎక్కువగా ఆఫీస్ డెస్క్ వర్క్ కోసం చాట్ జీపీటీని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అదే విధంగా ఎక్సెల్ షీట్స్, కోడింగ్ వంటి విషయాల్లో కూడా చాట్ జీపీటీ ప్రీమియం సర్వీసులను చాలామంది ఉపయోగిస్తున్నారు. ఫలితంగా పలు సాఫ్ట్ వేర్ సంస్థలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఇక ఏఐ సాధనాలు మనుషుల రోజువారి జీవితంలో భాగంగా మారిపోయాయి. అవి లేకుండా బతికే పరిస్థితికి చాలా మంది వచ్చేశారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఐఏ ద్వారానే తెలుసుకుంటున్నారు. దీన్ని తమ మిత్రుడుగా భావిస్తూ అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నారు. వ్యక్తిగత విషయాల దగ్గర నుంచి ఆఫీసు విషయాలు ఇలా అన్ని రకాలుగా దీన్ని ఉపయోగిస్తున్నారు. అయితే ఇది మంచి మిత్రుడుగా ఉంటూనే కొన్ని సార్లు శత్రువుగా మారిపోతోంది. దీనిపై చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications