వ్యాపారం అంటేనే రిస్క్ ఉంటుంది. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. లాభాలు వస్తే ఫరవాలేదు. నష్టాలు సంభవిస్తేనే కష్టం. ఎవరైనా ఒక బిజినెస్ ప్రారంభిస్తే.... లాభాపేక్ష తోనే మొదలు పెడతారు. అందుకోసం ఎంత పెట్టుబడి అవసరం, ఎప్పటికల్లా పెట్టుబడి తిరిగివస్తుంది, ఇలా రావాలంటే ఏమి చేయాలో పక్కా ప్రణాళిక వేసుకుంటారు. కానీ కొన్ని సార్లు ఆ లెక్కలు తప్పుతాయి. పరిస్థితులు తలకిందులవుతాయి. ప్రముఖ ఫుడ్ ఆర్దరింగ్ కంపెనీ స్విగ్గి విషయంలోనూ అలాగే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆన్లైన్ ఫుడ్ ఆర్దరింగ్ బిజినెస్ లో దేశంలోనే రెండే రెండు పెద్ద సంస్థలున్నాయి. ఒకటి జొమాటో కాగా రెండోది స్విగ్గి. దేశంలోని అన్ని ప్రధాన నగరాలూ, పట్టణాలకూ విస్తరించిన ఈ కంపెనీలు ...
విలువ పరంగా యునికార్న్ క్లబ్ లో చేరిపోయాయి. కానీ నష్టాల నుంచి మాత్రం బయటపడటం లేదు. ఇందుకు తార్కాణమే 2018-19 ఆర్థిక సంవత్సరంలో జొమాటో రూ 1,421 కోట్ల ఆదాయంపై రూ సుమారు రూ 2,000 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అదే సమయంలో స్విగ్గి మరింత అధికంగా నష్టాలను మూటగట్టుకుంది. స్విగ్గి మొత్తం నష్టం అక్షరాలా రూ 2,345 కోట్లు కావటం గమనార్హం. ఈ విషయాన్నీ ఎంట్రాకర్ ఒక కథనంలో వెల్లడించింది.

రూ 1,121 కోట్ల రాబడి...
బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగించే స్విగ్గి... నాస్పెర్స్ సహా పెద్ద పెద్ద ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ల నుంచి భారీ మొత్తంలో నిధులు సమీకరించింది. సుమారు ఐదేళ్ల క్రితం ప్రారంభించిన ఈ కంపెనీ... దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన పట్టణాలు, నగరాల్లో ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తోంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి స్విగ్గి మొత్తం రూ 1,121 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో సుమారు 72% మార్కెట్ ప్లేస్, ఫుడ్ సేవల ద్వారా సంపాదించింది. 18% ఆదాయాన్ని డెలివరీ సేవల ద్వారా ఆర్జించింది. మరో 10% ఆదాయాన్ని ఇతరత్రా మార్గాల ద్వారా పోగేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరం తో పోల్చితే 2018-19 లో కంపెనీ ఆదాయం 2.7 రేట్లు పెరిగింది. 2017-18 లో స్విగ్గి ఆదాయం రూ 417 కోట్లు కాగా, 2018-19 లో అది రూ 1,121 కోట్లకు పెరిగింది. ఇది కార్యకలాపాల విస్తరణ వల్ల సాధ్యపడింది.

పెట్టుబడులపై రూ 160 కోట్ల రాక...
స్విగ్గి గడిచిన ఆర్థిక సంవత్సరంలో పొదుపు చేసిన సొమ్ము పై భారీ రాబడిని పొందింది. డిపాజిట్ల పై వడ్డీ, మ్యూచువల్ ఫండ్ల ద్వారా మొత్తంగా రూ 160 కోట్ల రాబడిని ఆర్జించగలిగింది. 2018-19 లో స్విగ్గి మొత్తంగా రూ 7,000 కోట్ల వరకు ప్రైవేట్ ఈక్విటీ నిధులను సమీకరించింది. వాటిని కేవలం కార్యకలాపాలపై మాత్రమే కాకుండా ఇలా పెట్టుబడుల రూపంలోనూ మదుపు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కంపెనీ రూ 160 కోట్లు సంపాదించగలిగింది. అయితే, ఐఎల్ &ఎఫ్ఎస్ సంక్షోభంలో మాత్రం రూ 60 కోట్లు పోగొట్టుకున్నట్లు తన ఖాతాల్లో నమోదు చేసింది. ఇప్పటి వరకు స్విగ్గి రూ 12,767 కోట్ల విలువైన ఆర్థిక పెట్టుబడులు చేసినట్లు రికార్డుల్లో ఉంది. కాగా కంపెనీ ప్రస్తుత ఆర్థిక పరమైన ఆస్తుల విలువ రూ 5,824 కోట్లుగా ఉంది. ఇది మొత్తం కంపెనీ ఆస్తుల్లో 91% నికి సమానం.

మొత్తం ఖర్చులు రూ 3,637 కోట్లు...
గత ఆర్థిక సంవత్సరంలో స్విగ్గి ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. అవి ఏకంగా రూ 3,637 కోట్లకు పెరిగాయి. అంత క్రితం ఏడాదిలో స్విగ్గి ఖర్చులు రూ 841 కోట్లు మాత్రమే. అన్ని విభాగాల్లోనూ కంపెనీ నష్టాలను నమోదు చేస్తోంది. ఉద్యోగుల జీత భత్యాల కోసం కంపెనీ ఏకంగా రూ 537 కోట్లు ఖర్చు చేసింది. ముఖ్య ఉద్యోగుల కోసం రూ 13 కోట్లకు పైగా వెచ్చించింది. ఇందులో స్విగ్గి సిఓఓ వివేక్ సుందర్ ఒక్కడి వేతనమే రూ 4.9 కోట్లు కావటం గమనార్హం. డెలివరీ సేవలపై రూ 158 కోట్లు నష్టపోయింది. ప్రకటనలపై రూ 776 కోట్లు ఖర్చు చేసింది. ఆర్డర్ కాన్సలాషన్స్ పైన రూ 113 కోట్లు నష్టపోయింది. మొత్తంగా స్విగ్గి నష్టం 6.1 రెట్లు (500% నికి పైగా) పెరిగి రూ 2,345 కోట్లకు చేరుకుంది. అంటే ఈ కంపెనీ ఒక్క రూపాయి సంపాదనకు మూడు రూపాయలు ఖర్చు చేస్తోంది (రాబడి రూ 1,121 కోట్లు, ఖర్చులు రూ 3,637 కోట్లు). ఇది ఏ రకమైన వ్యాపార వ్యూహమో కాలమే నిర్ణయించాలని నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఎంత పోటీ ఉన్నా... డబ్బులు నీళ్లలా ఖర్చు చేయటం కంపెనీకి, ఆర్థిక వ్యవస్థకు మేలు చేయదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications