Mobile Charging In Train: రైల్వే ప్రయాణికులకు షాక్.. రైళ్లలో మొబైల్ ఛార్జింగ్ బంద్..!

రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే షాక్ ఇచ్చింది. రైళ్లో మొబైల్ ఛార్జింగ్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో రాత్రి సమయాల్లో మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేసుకునే సదుపాయానికి తాత్కాలికంగా ముగింపు పలకనున్నట్లు ప్రకటించింది. ఇకపై దేశవ్యాప్తంగా నడిచే అన్ని రైళ్లలోనూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఛార్జింగ్ సాకెట్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని రైల్వే బోర్డు అన్ని జోన్లకు అత్యవసర ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది. ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ఎలాంటి మినహాయింపులు ఉండబోవని ఉత్తర్వుల్లో తేల్చి చెప్పింది.

ఇటీవల సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో జరిగిన ఒక ప్రమాదం ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రయాణ సమయంలో రాత్రిపూట ఛార్జింగ్‌లో ఉంచిన ఒక ప్రయాణికుడి పవర్‌ బ్యాంక్ ఒక్కసారిగా పేలిపోయి దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన రైల్వే అధికారులను ఆలోచింప జేసింది. రైళ్లలో రాత్రి పూట ప్రయాణం చేసేవారు దాదాపు అందరు నిద్రపోతారు. చాలా మంది గాఢ నిద్రలోకి వెళ్లిపోతారు. అలాంటి సందర్భంలో మొబైల్ ఫోన్ల ఛార్జింగ్, ల్యాప్ టాప్ లు ఛార్జింగ్, పవర్ బ్యాంకుల ఛార్జింగ్ వల్ల షార్ట్ సర్క్యూట్లు లేదా బ్యాటరీ పేలుళ్ల వంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది.

Mobile Charging

అది తీవ్ర ప్రమాదానికి దారి తీస్తే భారీ ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉంది. మొబైల్, ల్యాప్ టాప్, పవర్ బ్యాంకుల ఛార్జింగ్ వల్ల ప్రాణనష్టంతో పాటు పెను ప్రమాదాలు ముంచుకొచ్చే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరించారు. అంతేకాకుండా రాత్రి సమయాల్లో ఛార్జింగ్ పెట్టే పరికరాల పట్ల ప్రయాణికులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఫోన్లు చోరీకి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. దీంతో రాత్రి సమయాల్లో మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేసుకునే సదుపాయానికి తాత్కాలికంగా ముగింపు పలకనున్నట్లు రైల్వే వివరించింది.

అయితే ఈ నిబంధన కొత్త తీసుకొచ్చింది కాదు. 2014 జూన్‌లోనే రైల్వే బోర్డు ఇలాంటి మార్గదర్శకాలను జారీ చేసిందని అధికారులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో వీటి అమలు అడపాదడపా మాత్రమే జరుగుతుండేది. ప్రయాణికుల్లో అవగాహన లోపించడం వల్ల ఈ నిబంధన పూర్తిగా అమలు కాలేదు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రైల్వే బోర్డు దీన్ని మరింత కఠినతరం చేసింది. ఏసీ కోచ్‌లలో ఇప్పటికే ఈ నిబంధన అమలులో ఉన్నప్పటికీ నాన్-ఏసీ కోచ్‌ల్లో సిబ్బంది కొరత, ఇతర ఆచరణాత్మక ఇబ్బందులు ఉన్నాయనే వాదనలను వినిపిస్తున్నాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+