చంద్రబాబు నాయుడు కొత్త లక్ష్యం నెరవేరుతుందా? ఆంధ్రప్రదేశ్‌ AI హబ్‌గా మారుతుందా? కీలక విశ్లేషణ!

దాదాపు రెండు దశాబ్దాల క్రితం.. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) 'బై బై బెంగళూరు, హలో హైదరాబాద్' అనే నినాదంతో టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించారు. అప్పుడు ఆయన దృష్టి సాఫ్ట్‌వేర్ రంగంపై ఉండేది. మైక్రోసాఫ్ట్ (Microsoft) వంటి అమెరికన్ దిగ్గజాలను ఒప్పించి, హైదరాబాద్‌ను 'సైబరాబాద్'గా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు.. 20 ఏళ్ల తర్వాత ఆయన తిరిగి అధికారంలోకి వచ్చారు. ఈ సారి లక్ష్యం మారింది. ఈసారి ఆయన దృష్టి AI (Artificial Intelligence)పై ఉంది. వాటికి శక్తినిచ్చే అత్యంత ముఖ్యమైన హార్డ్‌వేర్ అయిన డేటా సెంటర్లపై ఉంది. మరి ఈసారి ఆయన లక్ష్యం నెరవేరుతుందా?

పెట్టుబడి పందెం

  • ఐటీ రంగంలో అగ్రస్థానంలో నిలవాలనే గ్లోబల్ రేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకింది. ఇటీవల.. విశాఖపట్నం (Vizag) నగరంలో దాదాపు 25 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2 లక్షల కోట్లకు పైగా) భారీ పెట్టుబడి ప్రకటనలు వచ్చాయి.
  • రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries), బ్రూక్‌ఫీల్డ్ (Brookfield), , డిజిటల్ రియాల్టీ (Digital Realty) ల సంయుక్త సంస్థ అయిన 'డిజిటల్ కనెక్షన్' (Digital Connexion) 11 బిలియన్ డాలర్లు (సుమారు రూ.98,000 కోట్లు) పెట్టుబడితో AI-నేటివ్ డేటా సెంటర్‌ను నిర్మించనున్నట్లు ప్రకటించింది. 2030 నాటికి 1 గిగావాట్ (GW) సామర్థ్యంతో 400 ఎకరాలలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు.
  • దీనికి కేవలం నెల రోజుల ముందు.. గూగుల్ (Google) , అదానీ గ్రూప్ (Adani Group) సైతం అదే నగరంలో దాదాపు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో (సుమారు రూ.1,25,000 కోట్లు) AI డేటా సెంటర్ హబ్‌ను నిర్మిస్తామని ప్రకటించాయి.
  • ఈ పెట్టుబడులు, భారతదేశ డిజిటల్ భవిష్యత్తుపై జరుగుతున్న అతిపెద్ద పందెంలో ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర బిందువుగా నిలబెట్టాయి.
chandrababu naidu new vision andhra pradesh ai data center hub vizag 25 billion investment

హైదరాబాద్ టు వైజాగ్.. టెక్ ట్రాన్స్‌ఫర్

ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌కు సైబరాబాద్ పేరు తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) కృషి అపారం అని చెప్పుకోవచ్చు. యువతను ఆకర్షించడానికి వైబ్రంట్ నైట్‌లైఫ్ అవసరమని ఆయన అప్పట్లోనే గుర్తించారు. మైక్రోసాఫ్ట్ తన మొదటి డెవలప్ మెంట్ సెంటర్ ని 1998లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి ఆయన పట్టుదలే కారణమని బిల్ గేట్ట్ కూడా చెప్తుంటారు. ఆ విజయం హైదరాబాద్‌ను నేటికీ బలమైన మౌలిక సదుపాయాలున్న మెట్రోపాలిటన్ సిటీగా నిలబెట్టింది.
ఇప్పుడు.. విభజన తర్వాత, పశ్చిమ తీరంలో (ముంబై) కేంద్రీకృతమై ఉన్న డేటా సెంటర్ల అభివృద్ధిని తూర్పు తీరానికి(వైజాగ్) తరలించేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. ఇది 'రైస్ బౌల్'గా పిలువబడే రాష్ట్రానికి కొత్త వృద్ధి ఇంజిన్‌ను ఇవ్వాలనే ఆయన ధృడ సంకల్పాన్ని సూచిస్తుంది.

సవాళ్లు కూడా..

ఈ భారీ పెట్టుబడి విజయం సాధించాలంటే చంద్రబాబు నాయుడు రెండు ముఖ్యమైన సవాళ్లను అధిగమించవలసి ఉంటుంది..

1. పర్యావరణ భారం (Environmental Cost)

  • డేటా సెంటర్లు అపారమైన శక్తిని, నీటిని వినియోగిస్తాయి. ఆర్థికవేత్తలు మిహిర్ షా, సునీల్ మణి ఇటీవల చేసిన విశ్లేషణ ప్రకారం.. అనియంత్రిత డేటా సెంటర్ల వృద్ధి, ముఖ్యంగా తీరప్రాంతాలలో ఉండే పర్యావరణ వ్యవస్థలపై ఒత్తిడిని పెంచుతుంది.
  • ఒక GW సామర్థ్యం గల డేటా సెంటర్ (విశాఖలో ప్రతిపాదించబడిన సామర్థ్యం)కు దాదాపు ముంబై వార్షిక విద్యుత్ వినియోగంలో సగం వరకు విద్యుత్ అవసరమవుతుంది.
  • డేటా సెంటర్లకు నిరంతర నీటి సరఫరా అవసరం. దీని కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులతో .. ఉదాహరణకు రిలయన్స్ 6 GW సోలార్ ప్లాంట్.. వంటివి డేటా సెంటర్లను అనుసంధానించాలని నిర్ణయించింది. అలాగే ఈ నీటి వినియోగంలో పారదర్శకత, నీటి పునర్వినియోగం వంటి పద్ధతులను తప్పనిసరి చేయాలి.

2. ఉద్యోగ కల్పనలు (Limited Job Creation)

  • 2000లలో మైక్రోసాఫ్ట్, GE వంటి కార్యాలయాలు వేలాది మంది యువతకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను సృష్టించాయి. కానీ, AI డేటా సెంటర్లు మ్యాన్‌పవర్‌పై తక్కువగా ఆధారపడతాయి. అవి స్వయంచాలకంగా నడిచే వ్యవస్థలు (automated cathedrals).
  • కొంతమంది ప్రభుత్వ అధికారులు 1 GW డేటా సెంటర్ ద్వారా 2 లక్షల ప్రత్యక్ష , పరోక్ష ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తుండగా, కేంద్ర మంత్రులు కేవలం 6,000 ప్రత్యక్ష ఉద్యోగాలు మాత్రమే రావచ్చని అభిప్రాయపడ్డారు. ఈ గణాంకాలలో తేడా ఉంది.
  • మరోవైపు, ఈ డేటా సెంటర్లు శక్తినిచ్చే AI, భవిష్యత్తులో అనేక ఉద్యోగాలను తొలగించే అవకాశం ఉంది. దీనివల్ల, చంద్రబాబు నాయుడు కోరుకుంటున్న ఆర్థిక పరివర్తన, గతంలోలాగా విస్తృత స్థాయిలో ఉపాధిని సృష్టించకపోవచ్చు.

లక్ష్యం నెరవేరుతుందా?

మొత్తంగా చూస్తే.. ఇది కేవలం సాంకేతిక పెట్టుబడి మాత్రమే కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తుపై చంద్రబాబు నాయుడు చేసిన ఒక రాజకీయ పందెం. ఈ పెట్టుబడులు కేవలం నోటిమాటలు అయితే కావు, నిజమైనవి. ఇప్పటికే ఆ మొమెంటం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ, ఈసారి బహుమతులు కేవలం పెట్టుబడి లెక్కల్లోనే కాకుండా, సామాన్య ప్రజలకు స్పష్టంగా కనిపించేలా, పర్యావరణాన్ని పరిరక్షించేలా ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. చంద్రబాబు నాయుడు విజన్, ఆయన గత రికార్డుని బట్టి చూస్తే.. మరోసారి ఆయన అనుకున్నది సాధిస్తాడు అని రాజకీయ, ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఆయన కల నెరవేరుతుందా? ఆంధ్రప్రదేశ్.. భారతదేశపు AI హబ్ గా మారుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+