AP Liquor: సీఎం చంద్రబాబు లిక్కర్ ఆశలు ఘల్లంతు.. రిస్క్ కిక్ వద్దనుకుంటున్నారా..?
AP Liquor Applications: మరో నాలుగు రోజుల్లో ఏపీలో నూతన లిక్కర్ పాలసీ కింద షాపుల అలాట్మెంట్ జరగనుంది. ఈ క్రమంలో లిక్కర్ షాపుల వేలం కోసం దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే తెలంగాణలో మాదిరిగా నాన్ రిఫండబుల్ డిపాజిట్లను ప్రవేశపెట్టింది. ఇందుకోసం దరఖాస్తుదారులు రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంది.
ప్రైవేటు వ్యక్తులకు కొత్త పాలసీ కింద రెండేళ్ల కాలానికి లిక్కర్ షాపులను కేటాయించేందుకు ప్రస్తుతం దరఖాస్తులు వేసేందుకు పెద్దగా వ్యాపారుల నుంచి స్పందన కనిపించటం లేదని వెల్లడైంది. కేవలం అప్లికేషన్ల ద్వారా దాదాపు రూ.2 వేల కోట్లు వస్తాయని ప్రభుత్వం ఊహించినప్పటికీ.. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే అతికష్టం మీద రూ.200 కోట్లు వచ్చాయని తెలుస్తోంది. వాస్తవానికి లిక్కర్ వ్యాపారం కోసం పెద్దగా పోటీ ఉంటుంది. ఎక్కువ అప్లికేషన్లు పడితే ఎక్కువ ఆదాయం పొందొచ్చని చంద్రబాబు ప్రభుత్వం ప్లాన్ చేసిన్పటికీ తగిన స్థాయిలో దీని ఆదరణ కొరవడింది. ఇది చూస్తుంటే ప్రభుత్వం లిక్కర్ ఆదాయంపై పెట్టుకున్న ఆశలకు గండిపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వ్యాపారంలో లైసెన్స్ దక్కించుకోవటానికి వివిధ వర్గాలకు చెందిన ప్రజలు తమ అదృష్టం పరీక్షించుకునే పనిలో ఉన్నారు.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చాలా చోట్ల టీడీపీ నేతలు, వారి అనుచరులే లిక్కర్ షాపుల లైసెన్స్ కోసం దరఖాస్తులు చేస్తున్నారు. పైగా చాలా మంది తమలో తాము ఒక మాట అనుకుని ఎక్కువ దరఖాస్తులు లేకుండా సిండికేట్ అవుతున్నారు. కొందరు ఇప్పటికే అప్లికేషన్ వేసిన వారికి ఆఫర్లు ఇస్తుండగా.. మరికొందరు ఎవరికి వచ్చినా కలిసి వ్యాపారం చేసుకునేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం సైతం ఇలాంటి పరిస్థితులపై అప్రమత్తం అయ్యిందని తెలుస్తోంది. అయితే గడువు సమయంలోపు ప్రభుత్వం ఊహించిన స్థాయిలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు రాకుంటే గడువు పొడిగించే అవకాశాలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. లిక్కర్ ప్రియులకు మాత్రం విజయదశమి రోజు నుంచి తెరవనున్న షాపుల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దీంతో చంద్రబాబు సర్కార్ ప్రకటించిన విధంగా రూ.99కే లిక్కర్ అందుబాటులోకి రానుంది. దీంతో మద్యం ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విదయదశమి అంటే అక్టోబర్ 12న కొత్త మద్యం దుకాణాలు తెరచుకోనున్నాయి. దీంతో కొత్తగా ఏపీలో 3736 రిటైల్ మద్యం షాపులు తెరచుకోనున్నాయి. అలాగే ఇది రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.5,500 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టనుందని తెలుస్తోంది. దీంతో గతంలో ప్రభుత్వమే నిర్వహించిన మద్యం వ్యాపారం తాజాగా ప్రైవేటు వ్యక్తుల చేతికి తిరిగి వెళ్లిపోనుంది.


Click it and Unblock the Notifications