Chandrababu Naidu: దేశంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మంత్రాతో ఏపీ సర్కార్ వేగంగా ముందుకు సాగుతోంది. దీంతో కొత్తగా పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉద్యోగ కల్పనను వేగంగా అడుగులు వేస్తోంది. అయితే తాజాగా ఏపీ సర్కార్ దాదాపు 15 ప్రాజెక్టులకు కొత్తగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇది ఏపీలో దాదాపు 15 పెట్టుబడి ప్రాజెక్టులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో రూ.44,776 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా రానున్న కాలంలో ఏపీ వ్యాప్తంగా 19,580 ఉద్యోగాల కల్పన జరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. కొత్త ప్రాజెక్టుల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా గుజ్జిలి వద్ద 1,500 మెగావాట్ల ప్రాజెక్టు, చిట్టంవలసలో నవయుగ ఇంజినీరింగ్ 800 మెగావాట్ల ప్రాజెక్ట్ ఉన్నాయి. వీటికోసం కంపెనీ రూ.14,328 కోట్లు పెట్టుబడి పెడుతూ 3,450 జాబ్స్ కల్పిస్తోంది.

ఇదే క్రమంలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ అన్నమయ్య జిల్లా కొమ్మూరు వద్ద పంప్‌డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌పై రూ.10,300 కోట్ల పెట్టుబడి దాదాపు 3,000 మందికి ఉపాధి కల్పించబడుతుందని అధికారులు వెల్లడించారు. ఇదే క్రమంలో అనంతపురం రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనంతపురంలో 178 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు కోసం రూ.972 కోట్లు వెచ్చించనున్నట్లు ప్రకటించింది. ఇది దాదాపు 225 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు వెల్లడైంది. ఇదే జిల్లాలో టాటా పవర్ కంపెనీ 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.2,000 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించింది.
ఇదే క్రమంలో సత్యసాయి జిల్లా విషయానికి వస్తే ఎకోరెన్ ఎనర్జీ ఇండియా సంస్థ 201 మెగావాట్ల విండ్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటు కోసం రూ.1,651 కోట్లు వెచ్చించటానికి ముందుకు వచ్చింది. గడచిన 7 నెలల కాలంలో కేవలం మూడు సమావేశాల ద్వారా దాదాపు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు అనుమతులు ఇవ్వటం గమనార్హం. ఇక్కడ ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద వేగంగా ముందుకు సాగుతోంది. ప్రాజెక్టులను వేగవంతంగా ప్రారంభించటానికి వీలుగా అవసరమైన అనుమతుల జారీని పూర్తి చేయాలని సంబంధింత అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు.
వీటికి తోడు బీపీసీఎల్ కంపెనీ నుంచి దాదాపు రూ.96 వేల కోట్లకు ఒక పెద్ద ప్రాజెక్టుతో పాటు ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మరో రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటికి రానున్న మూడు నెలల్లోనే పునాది పడే అవకాశం ఉందని ప్రకటన వెల్లడించింది.
More From GoodReturns

Population policy: పిల్లల పెంపకానికి నెలకు వెయ్యి రూపాయలు.. ఉచిత విద్య! ఎవరికి వర్తిస్తుందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications