రూ.7.4 కోట్లు ఇవ్వాల్సిందే: ఐసీఐసీఐపై చందాకొచ్చార్ న్యాయపోరాటం

ముంబై: తనను ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు 2009 నుంచి 2018 మధ్య ఇచ్చిన బోనస్‌లు, స్టాక్స్ వాపస్ తీసుకోవాలని ఐసీఐసీఐ బ్యాంకు నిర్ణయించడాన్ని సవాల్ చేస్తూ మాజీ సీఈవో చందాకొచ్చార్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ రంజిత్ మోరే, జస్టిస్ మకరంద్ కార్నిక్‌లతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం డిసెంబర్ 2వతేదీన వాదనలు విననుంది. దీంతో మాజీ సీఈవో, ఐసీఐసీఐ బ్యాంకు మధ్య న్యాయపోరాటం ప్రారంభమైంది.

బ్యాంకు తొలగింపు...

బ్యాంకు తొలగింపు...

వీడియోకాన్ గ్రూప్‌కు ఐసీఐసీఐ బ్యాంకు రుణం ఇవ్వడంపై దుమారం రేగిన విషయం తెలిసిందే. క్విడ్ ప్రోకో (నీకిది -నాకది) కింద ఈ రుణాలు ఇచ్చినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో బ్యాంకు బోర్డు చందాకొచ్చార్‌ను తాత్కాలికంగా బాధ్యతల నుంచి తప్పించింది. ఇదే అంశంపై సీబీఐ దర్యాఫ్తు చేపట్టడంతో జూన్ 6న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి బీఎన్ శ్రీకృష్ణను దీనిపై దర్యాఫ్తు చేసేందుకు నియమించింది. అనంతరం ఆమెను బ్యాంకు తొలగించింది.

బోనస్, ఇతర మొత్తాలు చెల్లించాలని...

బోనస్, ఇతర మొత్తాలు చెల్లించాలని...

దీంతో పాటు ఆమెకు చెల్లించాల్సిన బోనస్‌లు, ఇతర మొత్తాలను నిలిపివేయడంతో పాటు ఏప్రిల్ 2009 నుంచి 2018 మార్చి వరకు చెల్లించిన బోనస్‌లు వాపస్ చేయాలని కోరింది. దీనిని చందాకొచ్చార్ హైకోర్టులో సవాల్ చేశారు. చందాకొచ్చార్‌ తరుపున విక్రమ్ నన్‌కాని, సుజయ్‌ కంతవాలా వాదనలు వినిపిస్తున్నారు. ఐసీసీఐ తరపున డారియస్ కమ్‌బాటా వినిపిస్తారు.

ప్రారంభంలో వెనుకేసుకొచ్చినా..

ప్రారంభంలో వెనుకేసుకొచ్చినా..

క్విడ్ ప్రోకో ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఈడీ, సీబీఐ చందాకొచ్చార్, భర్త దీపక్ కొచ్చార్‌లతో పాటు ఇతర బంధువులపై ఛార్జీషీట్ నమోదు చేశారు. అయితే ప్రారంభంలో చందాకొచ్చార్‌ను వెనుకేసుకొచ్చిన బోర్డు, ఆరోపణలపై విచారణకు నియమించిన బీఎన్ కృష్ణ ఆధ్వర్యంలోని స్వతంత్ర దర్యాఫ్తు సంస్థ నివేదిక అనంతరం ఆమెపై వేటు వేసింది.

రూ.7.4 కోట్లు ఇవ్వాలంటూ..

రూ.7.4 కోట్లు ఇవ్వాలంటూ..

2009 ఏప్రిల్ నుంచి 2018 మార్చి వరకు తీసుకున్న అన్ని రకాల బోనస్ చెల్లింపుల్ని తిరిగి ఇచ్చి వేయాలని చీఫ్ హెచ్‌ఆర్ ఆదేశించారు. బ్యాంక్ అంతర్గత విచారణలో చందాకొచ్చార్ అక్రమాలకు పాల్పడినట్లు రుజువు అయినందున, అక్టోబర్ నాటి నిష్క్రమణను సాధారణ రాజీనామాగా భావించలేమని, తొలగింపుగానే చూడాల్సి వస్తుందని హెచ్‌ఆర్ వర్గాలు తెలిపాయి. దీంతో మొత్తం రూ.7.4 కోట్లు ఇవ్వాలని తేల్చి చెప్పింది. దీనిని కొచ్చార్ వ్యతిరేకిస్తూ కోర్టు గడప తొక్కారు. తాను నివేదిక రాకముందే రిటైర్ అయ్యానని చెప్పారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+