Multibagger Stock: కరోనా సమయంలో చాలా కంపెనీలు కోలుకోలోని విధంగా దెబ్బతిన్నాయి. ప్రజలు ఎక్కడి వారు అక్కడికే పరిమితం కావాల్సి రావటంతో నష్టాలను చవిచూశాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి రావటంతో స్టాక్స్ పుంజుకుని తమ ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందిస్తున్నాయి.
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది చాలెట్ హోటల్స్ కంపెనీ గురించే. మార్చితో ముగిసిన త్రైమాసికానికి కంపెనీ మంచి అమ్మకాలతో పాటు మార్జిన్లను నమోదు చేసింది. హోటల్స్ అండ్ రిసార్ట్స్ రంగంలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న కంపెనీ గత మూడేళ్లలో ఇన్వెస్టర్ల డబ్బును నాలుగు రెట్లు పెంచింది.

తాజా ఫలితాలతో కంపెనీ షేర్లు రానున్న కాలంలో 13 శాతం మేర పెరుగుతాయని బ్రోకరేజ్ సంస్థ ఐడీబీఐ క్యాపిటల్ అంచనా వేసింది. ప్రస్తుతం స్టాక్ ధర రూ.403.55గా ఉంది. మే 29, 2020లో కంపెనీ షేర్ ధర రూ.100.70 వద్ద ఉంది. మూడేళ్ల కాలంలో 302 శాతం పెరిగి నాలుగింతలైంది. ఐదు నెలల కాలంలో స్టాక్ ధర దాదాపు 48 శాతం పెరిగి అక్టోబర్ 19, 2022న రికార్డు స్థాయిలో రూ.409.85ను తాకింది.
ఈ ఏడాది జనవరి-మార్చి మధ్యకాలంలో హోటల్స్ ఆక్యుపెన్సీ సగటున 74 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ఆక్యుపెన్సీ 56 శాతంగా ఉంది. మార్చి త్రైమాసికంలో నికర అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 128 శాతం పెరిగి రూ.337.9 కోట్లకు చేరుకుంది. EBITDA 385 శాతం పెరిగి రూ.152.4 కోట్లకు చేరుకుంది. అలాగే ఈ త్రైమాసికంలో రూ.39.2 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. రానున్న కాలంలో కంపెనీ షేర్ ధర రూ.457ను చేరుకునే అవకాశం ఉన్నట్లు బ్రోకరేజ్ సంస్థ అంచనా వేస్తూ కొనుగోలు రేటింగ్‌ను కొనసాగించింది.
Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అయితే వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.


Click it and Unblock the Notifications