Chai Sutta Bar: ఈరోజుల్లో యువత స్టార్టప్ కంపెనీలను ప్రారంభించి పిన్న వయస్సులోనే కోట్ల విలువైన కంపెనీలను సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో విజయం సాధించటం చాలా సులువని వారు భావిస్తున్నట్లు కొందరి ప్రవర్తన నిరూపిస్తోంది.
వివరాల్లోకి వెళితే Chai Sutta Bar పేరుతో చాయ్ కంపెనీని 23 ఏళ్ల అభినవ్ దూబే స్థాపించాడు. ప్రస్తుతం ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 500 ఔట్ లెట్స్ కలిగి ఉంది. కంపెనీ విలువ దాదాపు రూ.150 కోట్లుగా ఉంది. చిన్న వయస్సులోనే విజయాన్ని సాధించిన ఈ కుర్రాడు అనేక మంది యంగ్ ఎంటర్ ప్రెన్యూర్లకు రోల్ మోడల్‌గా కూడా ఉన్నాడు.

ఈ క్రమంలోనే యువ వ్యాపారవేత్త ఇటీవల తన ట్విట్టర్ ఖాతా వేదికగా చేసిన పోస్ట్ నెట్టింట ట్రోలర్ల చేతిలో పడింది. వాస్తవానికి అదొక మోటివేషనల్ స్పీచ్ అయినప్పటికీ దానిని వ్యక్తీకరించిన తీరు కొంత నెటిజన్ల ఆగ్రహానికి లోనయ్యింది. దీంతో ఇది నిమిషాల్లోనే వైరల్ గా మారిపోయింది.

ట్విట్‌లో.. తాము ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేసే ఉద్యోగుల కోసం వెతకటం లేదంటూ వ్యాఖ్యానించాడు. తమకు మార్కెట్‌ను దున్నేసే సైన్యం కావాలని రాసుకొచ్చాడు. అయితే ఈ ఘాటు వ్యాఖ్యలకు అంతే ఘాటైన ప్రతిస్పందన నెటిజన్ల నుంచి రావట గమనార్హం. దీనిపై చాలా మంది చిల్ బ్రో అంటూ కామెంట్స్ చేశారు.
సక్సెస్ రుచి చూసిన వారు ఇలానే ప్రవర్తిస్తారా లేక కొందరు మాత్రమే ఇలా మారతారో అర్థం కాదు. అయితే ఈ పోస్టు కింద కొందరు యువత మాత్రం ఏదైనా జాబ్ అవకాశం ఉంటే తమను పరిగణించాలని పోస్టులు పెట్టారు. వీటిపై స్పందించిన అనుభవ్ దూబే తమ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించాడు. తాను అంకితభావంతో పనిచేస్తానని అవకాశం ఉంటే ఇప్పించాలని సింఘ్యికీ అనే యూజర్ పేర్కొన్నాడు. చూడాలి దీనిని ఉద్యోగం కోసం వెళ్లే వ్యక్తులు ఎలా తీసుకుంటారో..


Click it and Unblock the Notifications