స్కామ్‌లో ఇరుక్కుని అష్టకష్టాలు అనుభవిస్తోన్న క్రాంప్టన్ గ్రీవ్స్ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు అప్పు తీసుకోవడమే మార్గమని భావిస్తోంది. రుణ దాతల నుంచి అప్పు తీసుకుంటే తప్ప ఇప్పుడున్న పరిస్థితి నుంచి గట్టెక్కలేమని, అప్పుతీసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ షేర్‌హోల్డర్స్‌ను కోరుతోంది.
మూలధన అవసరాలను, ఇతర వ్యాపార అవసరాలను తీర్చుకోవడం కోసం రూ.5 వేల కోట్లు అవసరమని, ఈ నిధులను రుణదాతల నుంచి సమీకరించాలని భావిస్తున్నట్లు సీజీ పవర్ పేర్కొంది. దీనికోసం ఈ నెల 14వ తేదీ.. శనివారం.. తన షేర్‌హోల్డర్స్‌ను వార్షిక సాధారణ సమావేశానికి ఆహ్వానించింది.

ఇవీ కంపెనీ మొత్తం అప్పులు...
తాజాగా షేర్ హోల్డర్స్‌కు పంపిన నోటీసులో.. సంస్థకు సంబంధించిన రుణాల గురించి సీజీ పవర్ వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం.. 2019 మార్చి 31 నాటికి సీజీ పవర్‌కు రూ.2,455.39 కోట్ల అప్పులు ఉన్నాయి. నాన్ ఫండ్ బేసిస్‌లో రూ.1.380 కోట్లు ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అదనపు నిధులు అవసరం. వర్కింగ్ క్యాపిటల్‌తోపాటుగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ కూడా అత్యవసరం. ఈ నేపథ్యంలో సీజీ పవర్ రుణదాతల వైపు చూస్తోంది.

ఆస్తులు, నికర నష్టాలు ఇవే...
2019 మార్చి 31 నాటికి సీజీ పవర్ గ్రూప్ ఆస్తులు రూ.2,115.98 కోట్లు. అలాగే గడిచి ఆర్థిక సంవత్సరంలో నికర నష్టాలు రూ.652.38 కోట్లు. సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్‌లో నిధుల అవకతవకలు జరిగినట్లుగా కంపెనీ బోర్డు గుర్తించిన సంగతి తెలిసిందే. గవర్నెన్స్, ఫైనాన్షియల్ లోపాలను కూడా బోర్డు కనుగొంది. ఈ నేపథ్యంలో కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్న గౌతమ్ థాపర్‌పై బోర్డు వేటు కూడా వేసింది. ఇప్పుడున్న పరిస్థితిని చక్కదిద్ది మళ్లీ కంపెనీని గాడిలో పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది.

ఆస్తిని మించిన అప్పు లభిస్తుందా?
సీజీ పవర్ ప్రస్తుతం కోరుతున్న అప్పు.. దాని ఆస్తుల కంటే ఎక్కువగా ఉంది. 2019 మార్చి 31 నాటికి సీజీ పవర్‌కు రూ.2,455.39 కోట్ల అప్పులు ఉండగా, రూ.5 వేల కోట్ల అప్పులు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు తన నాన్ కోర్ ఆస్తులను కూడా డిజిన్వెస్ట్ చేసేందుకు కూడా కంపెనీ బోర్డు చూస్తోంది. తనకున్న ఇంటర్నేషనల్ వ్యాపారాలను కూడా సమీక్షించుకుంటోంది. అప్పులను రీస్ట్రక్చర్ చేసి, తాజా క్యాపిటల్ కోసం రుణ దాతలతో చర్చలు ప్రారంభించినట్లు కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సంస్థ వార్షిక నివేదికలోనూ పేర్కొన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications