బిస్కెట్ కంపెనీ బ్రిటానియా సీఈఓ రాజీనామా.. స్టాక్ పై ఇన్వెస్టర్ల భయం భయం.. !

ప్రముఖ బిస్కెట్ల కంపెనీ అయిన బ్రిటానియా ఇండస్ట్రీస్ నిర్వహణలో పెద్ద గందరగోళం నెలకొంది. తాజగా బ్రిటానియా కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజ్‌నీత్ సింగ్ కోహ్లీ ఇవాళ అంటే 6 మార్చి గురువారం రోజున రాజీనామా చేశారని కంపెనీ తెలిపింది. అయితే రాజ్‌నీత్ సింగ్ కోహ్లీ 14 మార్చి 2025న తన పదవి నుండి వైదొలగగాల్సి ఉంది. FMCG కంపెనీలో ఇదే అతని చివరి రోజు కూడా. కానీ అతను వారం రోజుల ముందుగానే రాజీనామా చేయడం ఇన్వెస్టర్లను ఆందోళన కలిగించింది.

రాజీనామాకు కారణాలు: బయటి అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు రాజీనామా చేసినట్లు రాజ్‌నీత్ సింగ్ కోహ్లీ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అయితే అతను 26 సెప్టెంబర్ 2022న కంపెనీ CEOగా నియమితులయ్యారు. రాజ్‌నీత్ సింగ్ కోహ్లీ సెప్టెంబర్ 2022లో బ్రిటానియాలో CEOగా చేరగా, గతంలో జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, ఆసియన్ పెయింట్స్ ఇంకా కోకా-కోలా కంపెనీ నడిపే డొమినోస్ ఇండియాకు హెడ్'గా కూడా పనిచేశారు.

CEO of biscuit company Britannia resigns investors betting on the stock are scared

బ్రిటానియా షేర్ ధర పతనం

ఈ ప్రకటన తర్వాత BSEలో బ్రిటానియా షేర్లు ఒక శాతం పడిపోయి రూ.4653.05కి చేరుకున్నాయి. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర చూస్తే రూ.6,473.10. ఈ ధర అక్టోబర్ 2024 నాటిది. కానీ 4 మార్చి 2025న షేర్ ధర రూ.4,506.50 కనిష్ట స్థాయికి చేరుకుంది. ఈ పతనం స్టాక్‌ 52 వారాల కనిష్ట స్థాయి.

కంపెనీ త్రైమాసిక ఫలితాలు ఎలా ఉన్నాయంటే : తాజాగా బ్రిటానియా డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో కంపెనీ నికర లాభంలో 5 శాతం వార్షిక వృద్ధి (YoY)తో రూ.582 కోట్లకు చేరుకుందని నివేదించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.556 కోట్ల లాభం ఆర్జించింది. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) సంస్థ బ్రిటానియా కార్యకలాపాల నుండి ఆదాయం మూడవ త్రైమాసికంలో 6.4 శాతం పెరిగి రూ.4,463 కోట్లకు చేరుకుంది, గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.4,191.83 కోట్ల నుండి సంవత్సరానికి (YoY) పెరిగింది. మూడవ త్రైమాసికంలో బ్రిటానియా మొత్తం ఖర్చులు 9 శాతం పెరిగి రూ.3,875 కోట్లకు చేరుకున్నాయి, గత ఏడాది ఇదే కాలంలో రూ.3,544 కోట్లుగా ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+