ముంబై: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోన్న వేళ.. అనేక రాష్ట్రాలు మూడోదశను అమలు చేయడానికి సాహసించట్లేదు. వ్యాక్సిన్ల కొరత రాష్ట్ర ప్రభుత్వాలను వెంటాడుతోంది. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు 18 నుంచి 44 సంవత్సరాలలోపు వారికి టీకాలను ఇవ్వట్లేదు. నిన్న, మొన్నటిదాకా దీన్ని అమలు చేసిన ఢిల్లీ ప్రభుత్వం కూడా మూడోవిడత వ్యాక్సినేషన్‌ను నిలిపివేసింది. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన చేశారు.

వ్యాక్సిన్ల కొరత ఎందుకు?
ఇక తెలంగాణ ప్రభుత్వం 45 ఏళ్లకు పైనున్న వయస్సున్న వారికి వేయాల్సిన రెండో డోసు వ్యాక్సిన్‌ను సైతం నిలిపివేసిందంటే.. దాని షార్టేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ స్థాయిలో కోవిడ్ వ్యాక్సిన్లు దేశంలో నెలకొనడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమనే విమర్శలు వ్యక్తమౌతోన్నాయి. తాజాగా- సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేష్ జాదవ్ చేసిన వ్యాఖ్యలు ఈ విమర్శలకు మరింత ఆజ్యం పోసినట్టయ్యాయి. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తయారు చేస్తోన్న సీరమ్ సంస్థ ఈ తరహా కామెంట్స్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.

స్టాక్ గురించి పట్టించుకోకుండానే..
టీకాల స్టాక్ ఉందో లేదో చూసుకోకుండానే కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టిందని సురేష్ జాదవ్ చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించలేకపోయిందని అన్నారు. హీల్ హెల్త్ సంస్థ నిర్వహించిన ఓ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన దేశంలో వ్యాక్సిన్ల కొరత ఏర్పడటానికి గల కారణాన్ని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ముందుగా మూడో కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వారియర్లకు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించిందని..దాంతో దానికి తగ్గట్టే ప్రభుత్వానికి రెండు డోసులకు అవసరమయ్యేలా 6 కోట్ల డోసుల వ్యాక్సిన్ సరఫరా చేశామని అన్నారు.

సంప్రదించకుండానే వ్యాక్సిన్ డ్రైవ్..
ఆ తరువాత వ్యాక్సిన్ తయారీ కంపెనీలను సంప్రదించకుండానే రెండోదశను అమలు చేసిందని అన్నారు. రెండోదశ కింద దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతోన్న 45 సంవత్సరాలకు పైనున్న వయస్సు వారికి వ్యాక్సిన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. తాము తయారు చేస్తోన్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి పరిమితమేననే విషయం కేంద్రప్రభుత్వానికి ముందే తెలుసని అన్నారు. అయినప్పటికీ- తమను సంప్రదించకుండా హుటాహుటిన 45 ఏళ్లకు పైబడినవారికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు.

రెండో డోసు వ్యాక్సిన్లు తొలిడోసుగా..
ఫలితంగా- తయారవుతోన్న వ్యాక్సిన్‌కు, సరఫరా అవుతోన్న వ్యాక్సిన్ మధ్య అవాంఛనీయ జాప్యం చోటు చేసుకుందని వివరించారు. రెండో డోసుగా ఇవ్వడానికి నిల్వ ఉంచుకున్న వ్యాక్సిన్లను కూడా తొలి డోసుగా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించలేకపోవడమే కారణమని చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న వ్యాక్సిన్ల కొరత ఓ గుణపాఠం లాంటిదని సురేష్ జాదవ్ వ్యాఖ్యానించారు. ఉత్పత్తి సామర్ధ్యం, నిల్వల ఆధారంగా వ్యాక్సినేషన్ చేయాల్సి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు చెబుతున్నాయని, వాటిని కూడా కేంద్రం అనుసరించలేదని చెప్పారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications