Pulses Prices: పప్పుధాన్యాల విషయంలో కేంద్రం కఠిన నిర్ణయం.. ధరల కట్టడికి పక్కా స్కెచ్
Pulses Portal: భారీగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు అటు ప్రభుత్వంతో పాటు ఆర్బీఐ పలు చర్యలు తీసుకుంటోంది. అందులోనూ ఆకాశాన్ని అంటుతున్న ఆహార ద్రవ్యోల్బణం అదుపుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగా ఆయా ఉత్పత్తుల ధరలను కృత్రిమంగా పెంచుతూ వ్యాపారులు చేసే జిమ్మిక్కులను అడ్డుకోవడానికి కేంద్రం నడుం బిగించింది.
పెరుగుతున్న పప్పుధాన్యాల ధరలను అదుపు చేసేందుకు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. దిగుమతిదారులు, వ్యాపారులు ప్రతి వారం ఇంపోర్ట్ చేసుకుంటున్న స్టాక్ నిల్వను ఖచ్చితంగా ప్రకటించాలని ఆదేశించింది. ఈ మేరకు పప్పుధాన్యాల లభ్యతను పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఏప్రిల్ 15 నుంచి ఓ ఆన్‌లైన్ పోర్టల్‌ను కూడా ప్రారంభించబోతోంది.

పప్పుధాన్యాల లభ్యత, దిగుమతి సంబంధిత సమస్యలపై చర్చించడానికి పరిశ్రమలోని వాటాదారులతో వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే ఇటీవల వరుస సమావేశాలను నిర్వహించారు. ఇందులో మార్కెట్ ప్లేయర్‌లు కలిగి ఉన్న స్టాక్ పొజిషన్‌కు సంబంధించి వివిధ మూలాల ద్వారా వచ్చిన ఇన్‌పుట్‌లపైనా చర్చ జరిగింది. పప్పుధాన్యాల ఫార్వర్డ్ ట్రేడింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు అన్నీ స్టాక్‌హోల్డింగ్ సంస్థల ద్వారా వారానికొకసారి నిల్వలను బహిర్గతం చేయాలని నిధి ఖరే ఆదేశించారు. కాగా దేశీయ పప్పుధాన్యాల వినియోగంలో కొంత భాగం దిగుమతుల ద్వారానే తీరుతుంది. ఈ విషయంలో నిల్వలు సహా మార్కెట్ అవకతవకలను నిరోధించడానికి స్టాక్ పొజిషన్ ను ఎప్పటికప్పుడ మానిటర్ చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు తాజా చర్యలు తీసుకుంది.


Click it and Unblock the Notifications