Big Update: దేశంలో అమలవుతున్న దాదాపు అన్ని సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి గుర్తింపు కార్డుగా మారింది. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలు ఆధార్ కార్డుకు లింక్ అయితేనే ప్రభుత్వం నుంచి వచ్చే నగదు సాయం నేరుగా అందుకునే అవకాశం ఉంది. దీంతో ఆధార్ ప్రాముఖ్యత పెరుగుతూ వస్తోంది.
ఇదే సమయంలో ప్రస్తుతం దేశంలో అత్యంత సులభంగా మార్చుకోగలిగిన ఓ గుర్తింపు పత్రం ఆధార్ కార్డు. అయితే త్వరలో ఇది అత్యంత కఠినతరం కానుంది. దాదాపు పాస్ పోర్ట్ స్థాయిలో వెరిఫికేషన్ జరగవచ్చని తెలుస్తోంది. ఇందుకోసం కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది.

ఆధార్ కార్డు కోసం ఓ కొత్త విధానాన్ని అమలు చేయాలని మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీని ప్రకారం కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి గురించి రాష్ట్ర ప్రభుత్వం వాకబు చేయనుంది. ఇది పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ తరహాలో ఉంటుంది. SDM స్థాయి అధికారి ఆమోదం పొందిన తర్వాతే కొత్త ఆధార్ కార్డు జారీ చేయబడుతుంది. ఉత్తరప్రదేశ్‌లో ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైనట్లు నివేదికలు చెబుతున్నాయి.
కొత్త విధానంలో దరఖాస్తుదారుని భౌతిక ధృవీకరణ కోసం జిల్లా స్థాయిలో అదనపు జిల్లా మేజిస్ట్రేట్ మరియు సబ్-డివిజన్ స్థాయిలో SDM ను రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ఈ అధికారులు వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మాత్రమే కార్డులు జారీ చేయబడతాయి. ఫిజికల్ వెరిఫికేషన్ కోసం ప్రత్యేకంగా జిల్లా హెడ్ పోస్టాఫీసులు సహా కొన్ని ఆధార్ కేంద్రాలను ఎంపిక చేస్తారు.
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) కొత్త సూచనల ప్రకారం 18 ఏళ్లు నిండిన యువతకు మాత్రమే ఈ ప్రక్రియ వర్తిస్తుంది. అయితే ఒకసారి ఆధార్ రెడీ అయిన తర్వాత సాధారణ ప్రక్రియ ప్రకారం అన్ని రకాల అప్‌డేట్‌లను చేసుకోవచ్చు. ఇప్పటికే కార్డులు ఉన్నవారికి ఈ కొత్త విధానం వర్తించదు. అంటే ఇకపై కొత్తగా ఆధార్ పొందేందుకు గరిష్ఠంగా 180 రోజులు పట్టవచ్చు. ఫిజికల్ వెరిఫికేషన్ సమయంలో దరఖాస్తుదారు అక్కడ ఉండటం తప్పనిసరి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications