7th cpc: ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా ఆదాయపు పన్ను విషయంలో ఉద్యోగులకు కేంద్రం కొంత రిలీఫ్ ఇచ్చింది. అయితే రానున్న హోలీ తర్వాత ప్రభుత్వ సిబ్బందికి మోడీ సర్కారు మరో గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. DA బకాయిల విడుదల కోసం లక్షలాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 18 నెలలుగా ఎదురు చూస్తున్నారు. అయితే మరో విధంగానూ వారు లబ్ధి పొందనున్నట్లు వెల్లడించింది.

ప్రాథమిక వేతనాల్లో పెరుగుదల:
హోలీ అనంతరం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక వేతనాలు పెరిగే అవకాశం ఉందని మీడియా సంస్థ తన నివేదికలో తెలిపింది. తద్వారా ప్రస్తుతం ఉన్న కనీస వేతనం 18 వేల నుంచి 26 వేలకు పెరుగుతుందని వెల్లడించింది. ఫిట్‌మెంట్ ను 3.68కి పెంచాలని లక్షలాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని నెలలుగా డిమాండ్ చేస్తున్నారు. దానిపైనా నిర్ణయం తీసుకోవడానికి సర్కారు సిద్ధమౌతున్నట్లు పేర్కొంది.

హోలీ అనంతరం:
మార్చి 8(హోలీ) అనంతరం 7వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఫిట్ మెంట్ పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నివేదిక చెప్పింది. ఫిట్‌మెంట్ ను 6వ వేతన సంఘం(CPC) 1.86 శాతంగా సిఫార్సు చేసింది. ప్రస్తుతం 7వ CPC నాటికి సాధారణ ఫిట్‌మెంట్ 2.57 శాతంగా ఉంది. అంటే 4,200 గ్రేడ్ పేలో ఉన్న ఉద్యోగికి దాదాపు 40 వేలు వస్తుందన్నమాట. ఫిట్‌మెంట్ పెంపుపై ఇప్పటికే పలుమార్లు సమావేశాలు జరగ్గా.. 2024లోపు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని నివేదిక పేర్కొంది.

DA, HRA కూడా..
ఈ మార్చిలో డియర్ నెస్ అలవెన్స్ (DA)ను కూడా కేంద్రం పెంచే అవకాశం ఉందని గతంలో నివేదికలు వచ్చాయి. అదే జరిగితే జనవరి 1 నుంచి పెరిగిన DAను లెక్కిస్తారు. ఇంటి అద్దె భత్యం(HRA)లో సైతం ఆర్థిక మంత్రిత్వ శాఖ సవరణలు చేసినట్లు ఇప్పటికే వార్తలు వెలువడటం తెలిసిందే. త్వరలో జాతీయ ఎన్నికలు జరగనుండగా.. మోడీ సర్కారు కొత్త ఏడాదిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను సంతోషపెట్టే పనిలో పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications