Budget news: సామాన్యులకు పన్ను ప్రయోజనాలు అందిస్తూనే పెద్ద మొత్తంలో ట్యాక్స్ వసూలు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా.. ఈ ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్ మోదీ 2.0 ప్రభుత్వానికి చివరిది కానుంది. దీంతో ఇందులో పలు తాయిలాలు ప్రకటించవచ్చని అంచనాలు ఉన్నాయి.
గృహ రుణాలపై ఇప్పటి వరకు ఇస్తున్న ఆదాయపు పన్ను మినహాయింపును పెంచాలని ట్యాక్స్ పేయర్స్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. 2024-25 కేంద్ర బడ్జెట్‌లో దీనిపై సానుకూల నిర్ణయం వెలువడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వడ్డీ చెల్లింపు పరిమితిని ప్రస్తుతమున్న 2 లక్షల నుంచి 5 లక్షల మేరకు పెంచవచ్చని చెబుతున్నారు.

ఇళ్ల కొనుగోలుకు సంబంధించి ట్యాక్స్ మినహాయింపును గణనీయంగా పెంచాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CREDAI) ఒత్తిడి చేస్తోంది. తద్వారా రియల్ ఎస్టేట్ రంగంలోనూ మంచి బూమ్ వస్తుందని సూచిస్తోంది. పెరిగిన గృహ రుణం వడ్డీ రేట్లు వినియోగదారులకు సవాలుగా మారినట్లు తెలిపింది. ఈ కారణంగా EMIలపై అధిక ప్రభావం పడుతోందని వాదిస్తోంది.
2024 రెండవ త్రైమాసికం వరకు రెపో రేటు తగ్గకపోవచ్చని క్రెడాయ్ అంచనా వేసింది. ప్రస్తుతం వడ్డీ రేట్లు భారీ స్థాయిలో ఉండటంతో కొనుగోలుదార్ల నుంచి డిమాండ్ తగ్గినట్లు CREDAI వాదిస్తోంది. స్థిరమైన వృద్ధిని సాధించాలంటే డిమాండ్ పెరగాలని, ఇందుకోసం పన్ను చెల్లింపుదారులకు ఆకర్షణీయమైన ట్యాక్స్ ప్రయోజనాలను అందించాలని క్రెడాయ్ ఛైర్మన్ మనోజ్ గౌర్ అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications