PLI: అంతర్జాతీయ ఆర్థిక పథంలో భారత్ దూసుకుపోతోంది. కానీ కొన్ని విషయాల్లో ఇప్పటికీ వెనకబడే ఉన్నాం. దీన్ని గుర్తించిన కేంద్రం.. వాటిలో స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రణాళికలు రచించింది. వోకల్ ఫర్ లోకల్, మేడిన్ ఇండియా వంటి స్కీమ్ ల ద్వారా తన ఆకాంక్షను ప్రజలు, వ్యాపార వర్గాల్లోకి బలంగా తీసుకెళ్తోంది. వాటిని సాధించేందుకు కొన్ని ప్రోత్సాహకాలను సైతం ఆయా రంగాలకు ఇస్తోంది. వాటిలో ముఖ్యమైనది PLI పథకం.

భారీగా ప్రోత్సాహకాలు:
దేశంలో ఎంపిక చేసిన నాలుగు ఫార్మాస్యూటికల్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను విడుదల చేసింది. ఈ మేరకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం కింద రూ.166 కోట్లను ఇచ్చినట్లు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అధికారులు తెలిపారు. అర్హత కలిగిన 41 రకాల మందుల ఉత్పత్తి కోసం ఈ స్కీమ్ నోటిఫై చేసినట్లు చెప్పారు. ఇందుకోసం FY22-23లో మొదటిసారి ఫార్మాస్యూటికల్ రంగానికి PLI వర్తింపచేసినట్లు వెల్లడించారు. ఈసారి బడ్జెట్ లో రూ.690 కోట్లను కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఇవే ఆ కంపెనీలు:
"రూ.544 కోట్ల మేర ప్రోత్సాహకాలు పొందేందుకు ఇప్పటి వరకు 15 సంస్థల నుంచి దరఖాస్తులు అందాయి. మూల్యాంకనం అనంతరం డా. రెడ్డీస్ లేబొరేటరీస్, బయోకాన్, స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్, ప్రీమియర్ మెడికల్ కార్పొరేషన్ లను అర్హులుగా గుర్తించాం. మొత్తం రూ.221 కోట్లు ఆ కంపెనీలకు అందించేందుకు అంగీకారం లభించింది. అందులో 75 శాతం అంటే రూ.165.74 కోట్లు ప్రస్తుతం విడుదల అయ్యాయి. మిగిలిన ప్రోత్సాహకాల గురించి పరిశీలన జరుగుతోంది" అని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అధికారులు వెల్లడింంచారు.

ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా..
సంబంధిత డిపార్ట్ మెంట్ తెలిపిన వివరాల ప్రకారం, ఎంపిక చేసిన 41 క్లిష్టమైన ఔషధాల ఉత్పత్తిని దేశీయంగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం రూ.6,940 కోట్లు వెచ్చించే విధంగా బల్క్ డ్రగ్స్ కోసం PLI పథకాన్ని రూపొందించారు. 34 నోటిఫైడ్ బల్క్ ఔషధాల కోసం ఇప్పటివరకు 51 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. వీటిలో ఇప్పటి వరకు 22 ప్రారంభమయ్యాయి. ఐదేళ్ల స్కీమ్ వ్యవధిలో రూ.1,059 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం కుదిరింది. అందులో రూ.714 కోట్ల మేర ఇన్వెస్ట్ మెంట్స్ వచ్చాయి. 34 ఉత్పత్తులకు సంబంధించి 14 ప్రాజెక్టులు పట్టాలెక్కాయి.

ఏమిటీ PLI ?
ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) అనేది కేంద్రం ప్రవేశపెట్టిన ఓ స్కీమ్. ఆయా రంగాల్లోని కొన్ని అతి ముఖ్యమైన వస్తువుల ఉత్పత్తిని పెంచేందుకు ఈ పథకం ఉద్దేశింపబడింది. నిబంధనల మేరకు లక్ష్యాన్ని సాధించిన సంస్థలకు కొంత మొత్తాన్ని ప్రోత్సాహకంగా ప్రభుత్వం అందజేస్తుంది. దీనికి ఆయా రంగాల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో.. మరిన్ని కీలక విభాగాలకూ ఈ స్కీమ్ ను విస్తరిస్తున్నారు. అందుకు అనుగుణంగా గతేడాదితో పోలిస్తే ఈసారి బడ్జెట్ లో నిధులను సైతం పెంచారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications