Insurance: నష్టాల్లో ఉన్న మూడు ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల స్థితిని మెరుగుపరిచేందుకు ఆర్థిక శాఖ నడుం బిగించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 3 వేల కోట్ల అదనపు మూలధనాన్ని ఇన్ ఫ్యూజ్ చేయడానికి నిర్ణయించింది. FY22లోనూ ఈ సంస్థలకు కేంద్రం 5 వేల కోట్ల క్యాపెక్స్ ను అందించడం గమనార్హం. అంటే నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ మరియు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలను వరుసగా రెండుసార్లు మోడీ ప్రభుత్వం ఆదుకుంది.
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కు అత్యధికంగా 3 వేల 700 కోట్లు, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీకి 1,200 కోట్లు, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి 100 కోట్లు చొప్పున కేంద్రం అందించింది.

సాల్వెన్సీ నిష్పత్తిని మెరుగుపరచడంతో పాటు 150 శాతం రెగ్యులేటరీ అవసరాలను తీర్చాలని ఆయా సంస్థలు ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. తద్వారా సరిపడా మూలధన నిల్వల కారణంగా మెరుగైన క్లెయిమ్స్ చెల్లింపు, భవిష్యత్తులో ఏర్పడనున్న ఆకస్మిక పరిస్థితులు, వ్యాపార వృద్ధికి ఊతం లభిస్తుందని అభిప్రాయపడినట్లు సమాచారం.
సాల్వెన్సీ మార్జిన్ అనేది బీమా కంపెనీలకు తప్పనిసరిగా ఉండాల్సిన అదనపు మూలధనం. ఇది విపరీత పరిస్థితుల్లో ఆర్థిక బ్యాకప్ గా పనిచేస్తూ, అన్ని క్లెయిమ్‌లను కంపెనీ పరిష్కరించేలా చేస్తుంది. న్యూ ఇండియా అస్యూరెన్స్ మినహా మిగిలిన 3 పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల సాల్వెన్సీ రేషియో.. 2021-22లో 150 శాతం నియంత్రణ అవసరాల కంటే తక్కువగా ఉంది. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సాల్వెన్సీ నిష్పత్తి 63 శాతం ఉండగా.. ఓరియంటల్ ఇన్సూరెన్స్ 15 శాతం, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ 51 శాతంతో ఉన్నాయి.
2019-20 నుంచి ప్రభుత్వం ఈ 3 కంపెనీలకు మూలధనాన్ని కేటాయిస్తూనే వస్తోంది. ఆ ఏడాది 2 వేల 5 వందల కోట్లు, తర్వాతి సంవత్సరం దాదాపు 10 వేల కోట్లు, 2021-22లో 5 వేల కోట్లు చొప్పున సహకారం అందించింది. ఈ బీమా కంపెనీలు సంస్థాగత పునర్నిర్మాణం, ఉత్పత్తులు మరియు వ్యయం హేతుబద్ధీకరణ మరియు డిజిటలైజేషన్ సహా పలు సంస్కరణలకు లోనవుతున్నాయి. ఈ తరుణంలో మూలధనం ఇన్ ఫ్యూజన్ వాటికి చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications